వినాయకుడిపై ఎనలేని భక్తి.. రూ.2 కోట్లతో గణేశుడి గుడి నిర్మించిన క్రైస్తవుడు

Siva Kodati |  
Published : Jul 21, 2021, 08:41 PM IST
వినాయకుడిపై ఎనలేని భక్తి.. రూ.2 కోట్లతో గణేశుడి గుడి నిర్మించిన క్రైస్తవుడు

సారాంశం

కర్ణాటక రాష్ట్రం ఉడుపికి చెందిన 77 ఏళ్ల వ్యాపారి గాబ్రియెల్ నజరెత్ క్రైస్తవుడు. ఈ నేపథ్యంలో ఆయన శిర్వాలోని​ తన ఇంటి సమీపంలో సొంత ఖర్చుతో సిద్ధి వినాయక ఆలయాన్ని నిర్మించారు.

మతం పేరిట ఎన్నో దాడులు, దారుణాలు ప్రపంచమంతటా జరుగుతున్న వేళ  ఓ పెద్దాయన తన మత సామరస్యాన్ని చాటుకున్నారు. ఏకంగా రూ.2 కోట్లు పెట్టి గణేశుడి ఆలయాన్ని నిర్మించాడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం ఉడుపికి చెందిన 77 ఏళ్ల వ్యాపారి గాబ్రియెల్ నజరెత్ క్రైస్తవుడు. ఈ నేపథ్యంలో ఆయన శిర్వాలోని​ తన ఇంటి సమీపంలో సొంత ఖర్చుతో సిద్ధి వినాయక ఆలయాన్ని నిర్మించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆలయ నిర్మాణానికి ఆయన అక్షరాల రూ. 2 కోట్లు ఖర్చు చేశారు. తన తల్లిదండ్రులు ఫాబియన్​ సెబాస్టియన్ నజరెత్​, సబీనా నజరెత్​ స్మారకంగా ఈ ఆలయాన్ని నిర్మించినట్లు గాబ్రియెల్​ తెలిపారు.

ముంబయిలో దాదాపు 55 ఏళ్లు నివసించిన గాబ్రియెల్​.. నగరంలోని ప్రఖ్యాత సిద్ధివినాయక స్వామి ఆలయాన్ని తరచూ సందర్శించేవారు. సిద్ధివినాయక స్వామి వల్లనే తన జీవితం​లో ఎన్నో విజయాలు సాధించగలిగానని చెప్పుకొచ్చారు. తాను క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నా హిందూ మతం అంటే తనకు ఎంతో గౌరవమని గాబ్రియెల్ తెలిపారు. ఇక దశాబ్దం క్రితం ముంబయిను విడిచి తన స్వగ్రామంలో స్థిరపడ్డ గాబ్రియల్​.. అక్కడ సిద్ధి వినాయకుడి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా గాబ్రియెల్ ఇటీవల తన ఇంటి సమీపాన 20 సెంట్ల విస్తీర్ణంలో గుడిని కట్టించారు.
 

PREV
click me!

Recommended Stories

వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఓటింగ్ ఎలా జరిగింది? | Asianet News Telugu
తమిళనాడు ఎన్నికల్లో కమల్ హాసన్ జోరుగా ప్రచారం| Asianet News Telugu