Bipin Rawat: బిపిన్ రావత్ కండీషన్ సీరియస్..! త్వ‌ర‌లో కేంద్ర‌మంత్రి ప్రకటన!

By Rajesh KFirst Published Dec 8, 2021, 3:49 PM IST
Highlights

Bipin Rawat: తమిళనాడు రాష్ట్రంలోని నీల‌గిరి అడ‌వుల్లో కూనురు వ‌ద్ద ఆర్మీ హెలికాప్ట‌ర్ కూలిన‌ట్లు స‌మాచారం.  ఈ హెలికాప్టర్‌లో త్రివిధ ద‌ళాధిప‌తి జ‌న‌ర‌ల్ బిపిన్ రావత్ తో పాటు మరో 14 మంది ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్న‌ట్టు స‌మాచారం. ఘ‌టనపై రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరికొద్దిసేపట్లో పార్లమెంటులో ఓ ప్రకటన చేయనున్నారు. 
 

Bipin Rawat: తమిళనాడు లోని ఊటి దగ్గర  ఇవాళ  ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్‌లో త్రివిధ ద‌ళాధిప‌తి జ‌న‌ర‌ల్ బిపిన్ రావత్ తో పాటు మరో 14 మంది ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్న‌ట్టు స‌మాచారం. నీల‌గిరి అడ‌వుల్లో కూనురు వ‌ద్ద హెలికాప్ట‌ర్ కూలిన‌ట్లు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు నీటితో మంటలు ఆర్పేందుకు  ప్రయత్నం చేశారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో బిపీన్ రావత్ తో కుటుంబ సభ్యులు ఉన్నట్లు ఆండియన్ ఆర్మీ ధృవీకరించింది. 

నీలగిరి జిల్లా కూనుర్‌ వెల్లింగటన్‌లో సైనిక అధికారుల శిక్షణ కళాశాలలోని కార్యక్రమానికి హాజరుకావడానికి కొయంబత్తూరులోని ఆర్మీ సెంటర్‌ నుంచి హెలికాప్టర్‌లో ప్రయణించే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సమాచారం తెలుసుకున్న కేంద్ర కేబినెట్‌ అత్యవసరంగా సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోడీ 
అధ్య‌క్ష‌త జ‌రిగిన ఈ స‌మావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ప్రమాదం గురించి తెలియ‌జేసిన‌ట్టు స‌మాచారం. ఈ భేటీ అనంత‌రం.. ప్ర‌మాద స్థలానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ రానున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది వాయుసేన.

Read Also: https://telugu.asianetnews.com/national/cds-general-bipin-rawat-will-retire-next-year-january-r3sjfb

 సూలూర్ ఎయిర్ బేస్ నుంచి  టేకాఫ్ అయినా..  Mi-17V5 హెలికాప్టర్ కాసేపటికే కూనూరు సమీపంలో కూలిపోయిన‌ట్టు అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ప్ర‌మాద స‌మ‌యంలో CDS జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, నాయక్ గుర్‌సేవక్ సింగ్, నాయక్ జితేందర్ కుమార్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ బి సాయి తేజ, హవల్దార్ సత్పాల్ సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ  ప్రమాదంలో ఇప్పటివరకు 11మంది మృతి చెందారు. మృతదేహాలను వెల్లింగ్టన్‌లోని మిలటరీ ఆస్పత్రికి తరలించినట్లు స‌మాచారం. మృతుల్లో బిపిన్ రావత్ సతీమణి మధులిక ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే హెలికాప్టర్‌లో ఉన్న బిపిన్ రావత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

click me!