భారత్ బయోటెక్, సీరమ్ ఇనిస్టిట్యూట్‌లపై చైనా హ్యాకర్ల దాడి: డేటా చోరీకి యత్నం?

By narsimha lodeFirst Published Mar 1, 2021, 6:19 PM IST
Highlights

కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన సీరమ్ ఇనిస్టిట్యూట్ డేటా చోరీ చేసేందుకు హ్యాకర్లు ప్రయత్నించారు. చైనాకు చెందిన హ్యాకర్లు ఈ ప్రయత్నం చేసినట్టుగా ఇంటలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి.ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా సంస్థ ఒకటి ప్రకటించింది. 

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన సీరమ్ ఇనిస్టిట్యూట్ డేటా చోరీ చేసేందుకు హ్యాకర్లు ప్రయత్నించారు. చైనాకు చెందిన హ్యాకర్లు ఈ ప్రయత్నం చేసినట్టుగా ఇంటలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి.ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా సంస్థ ఒకటి ప్రకటించింది. 

సీరమ్ ఇనిస్టిట్యూట్  కంప్యూటర్లకు మాల్ వేర్ పంపి డేటాను చోరీ చేసేందుకు హ్యాకర్లు ప్రయత్నించారు. కరోనాను నియంత్రించేందుకు సీరమ్ ఇనిస్టిట్యూట్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను తయారు చేసింది.ఈ డేటా కోసం హ్యాకర్లు ప్రయత్నించారని ఇంటలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రపంచంలో విక్రయిస్తున్న వ్యాక్సిన్లలో అత్యధికంగా భారత్ తయారు చేస్తున్న వ్యాక్సిన్లలో 60 శాతం ఇండియాకు చెందినవే ఉన్నాయి.

సింగపూర్, టోక్యో కేంద్రంగా పనిచేస్తున్న గోల్డ్మన్ సాచ్స్ మద్దతుగల సైఫిర్మా, స్టోన్ పాండా అని పిలువబడే చైనా హ్యాకింగ్ గ్రూప్  భారత్ బయోటెక్, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాపై హ్యాకింగ్ కు పాల్పడిందని సమాచారం.

సీరమ్ ఇనిస్టిట్యూట్ విషయంలో  వారు బలహీనమైన వెబ్ సర్వర్లు నడుపుతున్నారని నిపుణులు గుర్తించారు. హ్యాకింగ్ విషయమై చైనా విదేశాంగ శాఖ మంత్రి ఈ విషయమై స్పందించలేదని అంతర్జాతీయ మీడియా సంస్థ ప్రకటించింది.

మరోవైపు సీరమ్ ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ లు కూడ ఈ విషయమై వ్యాఖ్యానించేందుకు నిరాకరించాయి. చైనా రాష్ట్ర భద్రతా మంత్రిత్వశాఖ సహకారంతో ఏపీటీ 10 పనిచేసిందని అమెరికా న్యాయశాఖ 2018లో ప్రకటించిన విషయం తెలిసిందే.

భారత్, కెనడా, ఫ్రాన్స్, దక్షిణకొరియా, యూకేలోని కరోనా వ్యాక్సిన్ కంపెనీలను లక్ష్యంగా చేసుకొని రష్యా, ఉత్తరకొరియా సైబర్ దాడులను కనుగొన్నట్టుగా మైక్రోసాఫ్ట్ నవంబర్ లో తెలిపింది.భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ బ్రెజిల్ సహా దేశాలకు ఎగుమతి చేశారు.
 

click me!