ప్రియుడి మరణం తట్టుకోలేక.. నిప్పంటించుకుని ప్రేయసి మృతి...

Published : Mar 01, 2021, 04:51 PM IST
ప్రియుడి మరణం తట్టుకోలేక.. నిప్పంటించుకుని ప్రేయసి మృతి...

సారాంశం

అతనే లోకం అనుకుంది.. అతనికే మనసిచ్చింది.. జీవితాంతం కలిసి నడవాలనుకుంది.. కానీ అతనేమో జీవితం వృధా అనుకున్నాడు.. 24 యేళ్లకే ఆత్మహత్య చేసుకుని బలవన్మరణం పాలయ్యాడు. ఈ విషయం తెలిసిన యువతి కుమిలిపోయింది. తిండీ, నిద్రా మానేసింది.. చివరికి ఒంటికి నిప్పంటించుకుని తాను కూడా ప్రియుడి చెంతకే చేరింది. హృదయాల్ని కదిలించే ఈ ఘటన తమిళనాడులో జరిగింది. 

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరుకు చెందిన కాలేజీ స్టూడెంట్ సుజాత (20), తన బంధువైన సిలంబర్సన్(24) గత కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. అయితే దీనికి అమ్మాయి బంధువులు ఒప్పుకోలేదు. 

పెళ్లి జరిపించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. దీంతో మనస్తాపానికి లోనైన సిలంబర్సన్ చిత్తూరులోని తన నివాసంలో ఫిబ్రవరి 22న ఉరేసుకుని మరణించాడు. ఆ విషయం సుజాతను షాక్ కు గురిచేసింది. అతని చావు సుజాతకు అశనిపాతంలా తాకింది. దీంతో ఆమెను తల్లిదండ్రులు చెన్నైలోని బంధువు ఇంటికి పంపించారు. 

కనీసం అక్కడైనా ఆమె మనసు కుదుటపడుతుందని భావించారు. కానీ తన ప్రియుడు మరణించాడన్న వార్తను ఆమె జీర్ణించుకోలేకపోయింది. తిండీ, నిద్రా మానేసింది. ధీంతో ఆమె శరీరం కొద్దికొద్దిగా నీరసించిపోయింది. శుక్రవారం నాడు ఒంటికి నిప్పంటించుకుంది. 
ఆ తరువాత మంటల బాధకు కేకలు వేయడం బంధువులు వచ్చి వెంటనే మంటలార్పి ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడిన ఆమె శనివారం తుదిశ్వాస విడిచింది. ప్రియుడు చనిపోయిన వారం రోజులకే ఆమెకు కూడా మరణించింది. ఈ సంఘటనలు స్థానికంగా కలకలం రేపాయి. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. సంక్రాంతి వేళ ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే
Rs 500 Notes : నిజంగానే ఆర్బిఐ రూ.500 కరెన్సీ నోట్లను రద్దు చేస్తుందా..? కేంద్రం క్లారిటీ