చైనా నుండి వచ్చిన మహిళకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు.
చెన్నై: హాంకాంగ్ నుండి చెన్నైకు వచ్చిన ఓ మహిళకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వెంటనే ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
హాంకాంగ్ నుండి చెన్నైకు వచ్చిన మహిళకు చెన్నై విమానాశ్రయంలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెుకు కరోనా వైరస్ సోకినట్టుగా వైద్యులు గుర్తించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.
undefined
Also read:కరోనా వైరస్ పై పోరాటానికి రూ.103 కోట్లు విరాళం....
చైనా నుండి ఈ వ్యాధి ప్రపంచంలోని పలు దేశాలకు వ్యాప్తి చెందుతోంది. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంది. ఈ క్రమంలోనే ప్రతి విమానాశ్రయంలో ప్రత్యేక పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Also read:కరోనా వైరస్ ఎఫెక్ట్: గాంధీలో ఒకరికి పరీక్షలు, భయం ఇదీ....
హాంకాంగ్ నుండి చెన్నైకు వచ్చిన మహిళను కూడ విమానాశ్రయంలో పరీక్షించారు.ఈ పరీక్షలతో ఆ మహిళకు కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
మరో వైపు గత వారంలో చైనా నుండి సుమారు 78 మంది చెన్నైకు వచ్చారు. వారందరికీ వైద్యులు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.