మిరమ్ టారోన్‌ను ఇండియ‌న్ ఆర్మీకి అప్ప‌గించిన చైనా పీఎల్ ఏ

By team teluguFirst Published Jan 27, 2022, 2:57 PM IST
Highlights

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మిరమ్ టారోన్ ఇటీవల పొరపాటున చైనా భూభాగంలోకి వెళ్లడంతో అతడిని చైనా అర్మీ అదుపులోకి తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ ఆర్మీ జరిపిన చర్చల ఫలితంగా నేడు చైనా పీఎల్ ఏ బాలుడిని అప్పగించింది. 

అరుణాచల్ ప్రదేశ్ (arunachal pradhesh) నుండి తప్పిపోయిన బాలుడు మిరమ్ టారోన్ (mirom taron)  ను చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) ఇండియ‌న్ ఆర్మీకి గురువారం అప్పగించింది. దీనిని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ధృవీకరించారు. ఈ మేర‌కు ఆయన ట్వీట్ చేశారు. ‘‘ చైనీస్ PLA అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన మిరామ్ టారోన్‌ను భారత సైన్యానికి అప్పగించింది.  అతడికి వైద్య పరీక్షలు జరుగుతున్నాయి.’’ అని అని కిరెన్ రిజిజు (kiren rijiju)చెప్పారు. 

మిరమ్ టారోన్ (mirom taron) జనవరి 18న బిషింగ్ (bhishin) ఏరియాలోని షియుంగ్ లా (shiyung la)నుంచి కనిపించకుండా పోయాడు. అయితే ఆ బాలుడు త‌ప్పిపోయిన ప్రాంతం వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలో ఉంది. ఆ బాలుడు చైనా భూభాగంలోకి వెళ్లాడని, చైనా పీఎల్ఏ (chaina pla)  అత‌డిని అదుపులోకి తీసుకున్నార‌ని అంద‌రూ భావించారు. అందుకే ఆ బాలుడి ఆచూకీ క‌నుగొనేందుకు భార‌త సైన్యం వెంట‌నే చైనా వైపునకు వెళ్లింది. అయితే అత‌డిని గుర్తించ‌లేక‌పోయింది.  

అరుణాచల్‌ (arunachal pradhesh)లో తప్పిపోయిన భారతీయుడిని చైనా ఆర్మీ అప‌హ‌రించింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. దీనిని మొద‌ట చైనా ఖండించింది. అయితే ఓ బాలుడిని కనుగొన్నట్లు చైనీస్ PLA మూడు రోజుల కింద‌ట ధృవీక‌రించింది. ఈ ఘ‌ట‌న‌లో బాలుడిని విడిపించాల‌ని ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ‌చ్చాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (congress leader rahul gandhi) ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిప‌డ్డారు. ‘‘గణతంత్ర దినోత్సవానికి కొద్ది రోజుల ముందు చైనీయులు భారతీయ పౌరుడిని అపహరించారు. మేము మీరమ్ టారోన్ కుటుంబంతో ఉన్నాము. మేము ఎప్ప‌టికీ ఆశను కోల్పోము. ఓటమిని అంగీకరించము. కానీ ప్రధాని మౌనం బాలుడిని బాధించ‌కూడ‌దు.’’ అని రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ (tweet) చేశారు. 

దీంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అదృశ్యమైన యువకుడి కోసం చైనా ఆర్మీతో హాట్‌లైన్ (hot line) ద్వారా సంప్రదింపులు జరిపినట్టుగా రక్షణ శాఖ వర్గాలు రెండు రోజుల కింద‌ట వెళ్ల‌డించింది. ఈ విష‌యంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి బుధవారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ‘‘ పీఎల్ ఏ సానుకూలంగా స్పందించి మా జాతీయుడిని అప్పగిస్తామని చెప్పింది. విడుదల చేసే స్థలాన్ని సూచించింది. వారు త్వరలో తేదీ, సమయాన్ని తెలియజేయడానికి అవకాశం ఉంది. అయితే వారి వైపు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జాప్యం జరిగింది’’ అని కిరెన్ రిజ‌జు ట్వీట్ చేశారు. ప్రోటోకాల్‌ల ప్రకారం బాలుడిని శోధ‌న చేసి తిరిగి ఇస్తానని చైనా హామీ ఇచ్చిందని న్యాయ మంత్రి తెలిపారు. గుర్తింపు ప్రయత్నాలకు సహాయం చేయడానికి భారత సైన్యం చైనా వైపు యువకుల వ్యక్తిగత వివరాలు, ఫోటోలను కూడా పంచుకుంద‌ని చెప్పారు. 

హాట్‌లైన్ కాల్‌ను మార్చుకున్న భారత-చైనా సైన్యాలు 
చైనా పీఎల్ ఏ, ఇండియ‌న్ ఆర్మీ మంగళవారం హాట్ లైన్ చ‌ర్చ‌లు నిర్వ‌హించాయి. మిరామ్ టారోన్ ను ఇండియాకు అప్ప‌గిస్తామ‌ని చైనా అంగీక‌రించింది. ఆ బాలుడిని ఏ ప్రాంతంలో మార్చుకోవాల‌నే విష‌యాన్ని రెండు దేశాల ఆర్మీలు నిర్ణ‌యించాయి. 

click me!