లడ్డాఖ్‌లో భారత్ భూభాగం చైనా ఆక్రమణ: ఆరోపించిన రాహుల్ గాంధీ

Published : Aug 20, 2023, 09:39 AM IST
లడ్డాఖ్‌లో  భారత్ భూభాగం చైనా ఆక్రమణ: ఆరోపించిన రాహుల్ గాంధీ

సారాంశం

లడ్డాఖ్ లో  ఇండియా  భూబాగాన్ని చైనా ఆక్రమించుకుందని  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.  ఈ విషయంలో  ప్రధాని మోడీ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.

న్యూఢిల్లీ: లడ్డాఖ్ లో భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు.లడ్డాఖ్ లో ఆదివారంనాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో  రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఆయన మీడియాతో మాట్లాడారు.

లడ్డాఖ్ లో  ఇండియా భూమిని చైనా ఆక్రమించిన విషయాన్ని స్థానికులు  ఎవరిని అడిగినా చెబుతారన్నారు.  కానీ ఒక్క అంగుళం భూమి కూడ ఆక్రమణఖకు గురికాలేదని  ప్రధాని మోడీ చెప్పడాన్ని రాహుల్ గాంధీ తప్పుబట్టారు. లడ్డాఖ్ లో  ప్రజలు సంతోషంగా లేరన్నారు.  లడ్డాఖ్ ప్రజలు ఏ మాత్రం సంతోషంగా లేరని రాహుల్ గాంధీ చెప్పారు. తన తండ్రి రాజీవ్ గాంధీ లడ్డాఖ్ చాలా ఇష్టమైన ప్రాంతంగా ఆయన  గుర్తు చేసుకున్నారు. భారత్ జోడో యాత్రలో తాను లడ్డాఖ్ వచ్చినట్టుగా  చెప్పారు. అయితే ఆంక్షల కారణంగా ఎక్కువ సేపు లడ్డాఖ్ లో గడపలేకపోయినట్టుగా రాహుల్ గాంధీ వివరించారు.

లడ్డాఖ్ లోని ఇండియా భూభాగంలోకి  చైనా  చొచ్చుకు వచ్చిందని ఆయన ఆరోపించారు.   గత మూడేళ్లుగా  తూర్పు లడ్డాఖ్ ప్రాంతంలో  ఇండియా, చైనా మధ్య ఘర్షణలు చోటు  చేసుకుంటున్నాయి.  2020 జూన్ లో గాల్వాన్ లోయలో  రెండు దేశాల సైన్యం మధ్య ఘర్షణ జరిగింది.లడ్డాఖ్  పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ  శనివారం నాడు  బైక్ పై  ప్యాంగ్యాంగ్  సరస్సు వరకు   వెళ్లారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu