Bipin Rawat Funeral : ఇక సెలవ్.. ముగిసిన రావత్ దంపతుల అంత్యక్రియలు, యావత్ దేశం కన్నీటి వీడ్కోలు

By Siva KodatiFirst Published Dec 10, 2021, 5:38 PM IST
Highlights

తమిళనాడులో జరిగిన ఘోర హెలికాప్టర్‌ ప్రమాదంలో (helicopter Crash) ప్రాణాలు కోల్పోయిన భారత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ (bipin rawat) దంపతుల అంత్యక్రియలు ఆశేష జనవాహిని కన్నీటి వీడ్కోలు మధ్య ముగిశాయి. 

తమిళనాడులో జరిగిన ఘోర హెలికాప్టర్‌ ప్రమాదంలో (helicopter Crash) ప్రాణాలు కోల్పోయిన భారత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ (bipin rawat) దంపతుల అంత్యక్రియలు ఆశేష జనవాహిని కన్నీటి వీడ్కోలు మధ్య ముగిశాయి. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలోని బ్రార్‌ స్క్వేర్‌ శ్మశానవాటికలో (delhi cantonment crematorium) రావత్‌, ఆయన సతీమణి మధులిక రావత్ పార్థివదేహాలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. అధికారులు, ప్రముఖులు, ప్రజల నివాళుల అనంతరం.. కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. 

బిపిన్ రావత్‌కు గౌరవసూచికంగా 17 శతఘ్నులను గాల్లోకి పేల్చి వందనం సమర్పించారు. సీడీఎస్‌ అంత్యక్రియల్లో 800 మంది సర్వీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ దామి, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, డీఆర్‌డీఓ చీఫ్‌ జి. సతీశ్‌ రెడ్డి, పలువురు కేంద్రమంత్రులు, రాజకీయ ప్రముఖులు తదితరులు హాజరై రావత్ దంపతులకు తుది వీడ్కోలు పలికారు.     

Also Read:Bipin Rawat: ప్రారంభమైన అంతిమయాత్ర.. రావత్‌కు 17 గన్ సెల్యూట్, అంత్యక్రియల్లో 800 మంది సిబ్బంది

అంతకుముందు ప్రముఖులు, సైనిక సిబ్బంది, ప్రజల సందర్శనార్థం రావత్‌ దంపతుల భౌతికకాయాలను ఈ ఉదయం ఢిల్లీ కామ్‌రాజ్‌ మార్గ్‌లోని ఆయన నివాసానికి తరలించారు. అక్కడ పలువురు కేంద్రమంత్రులు, రాజకీయ ప్రముఖులు వారికి నివాళులర్పించారు. అనంతరం మధ్యాహ్నం కామ్‌రాజ్‌ మార్గ్‌ నుంచి బ్రార్‌ స్క్వేర్‌ శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగింది. రెండు గంటల పాటు సాగిన ఈ అంతిమ యాత్రలో దారి పొడువునా ప్రజలు రావత్‌ భౌతికకాయంపై పూలు జల్లుతూ వీడ్కోలు పలికారు. 

కాగా.. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌ (General Bipin Rawat), ఆయన సతీమణి మధులిక రావత్‌తో పాటుగా 13 మంది ఈ ప్రమాదంలో మరణించారు. ప్రాణాలతో బయటపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్‌కు బెంగళూరులోని ఎయిర్‌ఫోర్స్ కమాండ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. 

click me!