తన బాయ్ ఫ్రెండ్ గురించి తమ్ముడికి తెలిసిపోయిందని..

Published : Oct 12, 2018, 09:43 AM IST
తన బాయ్ ఫ్రెండ్ గురించి తమ్ముడికి తెలిసిపోయిందని..

సారాంశం

తమ్ముడు ఎక్కడ తన బాయ్ ఫ్రెండ్ విషయం తల్లిదండ్రులకు చెబుతాడోనని భయపడింది. అంతే.. సొంత తమ్ముడిని దారుణంగా హత్య చేసింది

తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్న విషయం తమ్ముడికి తెలిసిపోయిందని.. ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. తమ్ముడు ఎక్కడ తన బాయ్ ఫ్రెండ్ విషయం తల్లిదండ్రులకు చెబుతాడోనని భయపడింది. అంతే.. సొంత తమ్ముడిని దారుణంగా హత్య చేసింది. ఈ సంఘటన లూథియానా నగరంలో వెలుగుచూసింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన రేణు కనోజియా (19) ఓ యువకుడిని ప్రేమిస్తోంది. రేణుకకు అన్షు కనోజియా అనే నాలుగేళ్ల వయసున్న సోదరుడు ఉన్నాడు. రేణుకు యువకుడితో ఉన్న సంబంధం గురించి తెలిసిన నాలుగేళ్ల సోదరుడు తల్లిదండ్రులకు చెబుతాడనే భయంతో రేణు తమ్ముడిని ఊపిరాడకుండా చేసి హతమార్చింది. బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు హత్య కేసు మిస్టరీని చేధించారు. తన ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో వారికి చెబుతాడనే భయంతోనే తమ్ముడిని హత్య చేశానని రేణు పోలీసుల ముందు అంగీకరించింది. దీంతో పోలీసులు నిందితురాలైన రేణు ను అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ
Salary: ఉద్యోగం చేసే వారికి గుడ్ న్యూస్‌.. మ‌రో 2 నెల‌ల్లో భారీగా పెర‌నున్న జీతాలు.?