అత్యవసర సమయాల్లో కాపాడే బ్లూటూత్ జుంకాలు:ఎలా పనిచేస్తాయంటే?

By narsimha lode  |  First Published Mar 10, 2024, 8:09 AM IST

 యూపీ విద్యార్థులు బ్లూటూత్  జుంకాలను తయారు చేశారు. సాధారణ చెవి పోగుల తరహలోనే ఉండి ఈ ఇయర్ రింగ్స్ అత్యవసర సమయాల్లో  కీలకంగా పనిచేయనున్నాయి.


న్యూఢిల్లీ: అత్యవసర సమయంలో పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చేలా ఇయర్ రింగ్స్ ను తయారు చేశారు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన  ఇంజనీరింగ్ విద్యార్థులు.

అమ్మాయిలు తమ చెవులకు  రింగులు ధరిస్తారు.  అయితే ఈ రింగులు అమ్మాయిల  భద్రతను కల్పించేలా రూపొందించారు ఇంజనీరింగ్ విద్యార్థులు.ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్ పూర్ కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు బ్లూటూత్ జుంకాలను తయారు చేశారు.

Latest Videos

ఇన్నోవేషన్ సెల్  కోఆర్డినేటర్ వినీత్ రాయ్ నేతృత్వంలో గోరఖ్ పూర్ కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్  టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ కు చెందిన విద్యార్థులు ఈ బ్లూటూత్ జుంకాలను తయారు చేశారు. ఈ కాలేజీలో  చదివే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ విభాగానికి చెందిన నలుగురు బి.టెక్. విద్యార్థులు ఈ చెవి పోగులు తయారు చేశారు.

ఆఫ్రీన్ ఖాటూన్, ఉమ్మె హబీబా, రియా సింగ్, ఫాయా సూరిలు ఈ బ్లూట్ జుంకాలను తయారు చేశారు. సాధారణ చెవి పోగుల మాదిరిగానే ఇవి ఉంటాయి.  బ్లూటూత్ ఇయర్ బడ్ గా సరిపోతాయి. ఏదైనా ఆపద వచ్చిన సమయంలో ఈ జుంకాలు ఆయుధంగా పనిచేయనున్నాయి.

అమ్మాయిలు అత్యవసర సమయంలో  పోలీసులతో పాటు కుటుంబ సభ్యులకు కూడ అత్యవసరంగా ఫోన్ చేయడానికి ఈ జుంకాలు సహాయం చేస్తాయి.మరో వైపు ఈ జుంకాలు పెప్పర్ స్ప్రే ను విడుదల చేయనున్నాయి.

ఈ జుంకాలలో రెండు పానిక్ బటన్లను ఏర్పాటు చేశారు. మూడు ఎమర్జెన్సీ నెంబర్లను  ఫీడ్ చేసుకోవచ్చు.  పానిక్ బటన్ లో ఒకటి  అత్యవసర నంబర్లకు ఫోన్ తో పాటు లోకేషన్ ను కూడ పంపుతుంది. మరో బటన్ ను నొక్కితే  పెప్పర్ స్ప్రే ను విడుదల చేయనుంది. ఈ జుంకాల బరువు  35 గ్రాములు. దీని ధర రూ. 1650. 

బ్లూటూత్ జుంకాలలో  ఒక బ్లూటూత్ మాడ్యూల్ తో పాటు బ్యాటరీ, రెండు స్విచ్ లు, స్టీల్ పైపును ఉపయోగించారు. విద్యార్థులు బ్లూటూత్  జుంకాలు తయారు చేయడంపై  ఐటీఎం  డైరెక్టర్ డాక్టర్ ఎన్ కే సింగ్, సెక్రటరీ అనుజ్ అగర్వాల్ హర్షం వ్యక్తం చేశారు.  తమ కాలేజీ విద్యార్థులకు  అవసరమైన పరికరాలను  ల్యాబ్ లో అందుబాటులో ఉంచుతామని  ఆయన చెప్పారు.
 

click me!