జవాన్ల వెంటే...: 21 పార్టీల మద్దతు, రాహుల్ ప్రకటన

Published : Feb 27, 2019, 05:52 PM IST
జవాన్ల వెంటే...: 21 పార్టీల మద్దతు, రాహుల్ ప్రకటన

సారాంశం

భారత జవాన్ల వెంట తాము ఉన్నామని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రకటించారు.

న్యూఢిల్లీ: భారత జవాన్ల వెంట తాము ఉన్నామని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రకటించారు.

బుధవారం నాడు న్యూఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ హాల్ లో 21 రాజకీయ పార్టీలు సమావేశం నిర్వహించాయి. పూల్వామా ఘటనలో అమరులైన సీఆర్‌పీఎఫ్ జవాన్లకు విపక్షాలు శ్రద్ధాంజలి ఘటించాయి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

వైమానిక దళాల ధైర్య సాహసాలు అభినందనీయమని  21 పార్టీల నేతలు అభిప్రాయపడినట్టు రాహుల్ చెప్పారు.త్వరలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్టుగా రాహుల్ చెప్పారు. భద్రతా దళాల త్యాగాలను రాజకీయ లబ్ది కోసం వాడుకోవడాన్ని విపక్షాలు ఖండించాయి.

సంకుచిత రాజకీయాల కోసం భద్రతను ఫణంగా పెట్టకూడదని విపక్షాలు అభిప్రాయపడ్డాయి. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడంలో జాతి అభిమతాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విపక్షాలు ప్రధానిని కోరాయి.
 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?