CJI NV Ramana: కోవిడ్ ఆందోళన నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక నోటీసు!

Published : Aug 12, 2022, 06:22 AM IST
CJI NV Ramana: కోవిడ్ ఆందోళన నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక నోటీసు!

సారాంశం

CJI NV Ramana: దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో మాస్క్‌లను తప్పనిసరి చేశారు. మరోమారు భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.  

CJI NV Ramana: దేశ‌వ్యాప్తంగా కరోనా అదుపులోనే ఉన్నప్పటికీ..  ఢిల్లీలో మాత్రం గత కొద్దిరోజులుగా కరోనా కేసుల‌ సంఖ్య వేగంగా పెరుగుతోంది. నిత్యం రెండువేలకు పైగా కేసులు న‌మోదవుతున్నాయి. ఈ క్ర‌మంలో ఇన్‌ఫెక్షన్ రేటు 15 శాతం దాటింది. ఈ నేప‌థ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్ర‌జ‌లు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించింది.  

ఇదిలా ఉంటే.. దేశంలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్. వి. రామన్ కీల‌క ఆదేశాలు జారీ చేశారు. న్యాయస్థానంలో త‌ప్ప‌నిస‌రిగా మాస్క్‌లు ధరించాలని సూచించారు. 

న్యాయవాదులకు సలహా ఇస్తూ..  చాలా మంది ఉద్యోగులు, తోటి న్యాయమూర్తులు కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్ బారిన పడుతున్నారని  అన్నారు. కోర్టు కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడు CJI లాయర్లతో, “దయచేసి మాస్క్ ధరించండి. సిబ్బంది, సహోద్యోగులలో చాలా మంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు. న్యాయమూర్తులు కూడా వ్యాధి బారిన పడుతున్నారని సూచించారు. 
  
న్యాయవాదులు కూడా మాస్క్‌లు ధరించాలని కోరారు. ఈ సమయంలో.. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. త‌న‌కు  కరోనా సోకలేదని, సీనియర్ న్యాయవాది ఎ.కె. ఎం. సింఘ్వీకి కరోనా వైరస్ సోకింద‌ని తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాన‌ని అన్నారు.

అనంత‌రం.. ఎన్నికల్లో ఉచిత హామీలు, సంక్షేమ పథకాలపై దాఖాల‌పై జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ క్రిష‍్ణ మురారీల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.  

ఆర్థిక వ్యవస్థ నష్టపోతున్న డబ్బు, సంక్షేమ చర్యల మధ్య సమతుల్యతను సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఉచిత హామీలు ఇచ్చి నెరవేర్చని పార్టీల గుర్తింపును రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. అది సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ఇవ్వటాన్ని సవాల్‌ చేస్తూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. అలా చేసే పార్టీల గుర్తులు, రిజిస్ట్రేషన్‌ను ఎన్నికల సంఘం రద్దు చేసేలా ఆదేశాలనివ్వాలని కోరారు.

ఈ పిల్‌పై విచారణ చేపట్టింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ క్రిష‍్ణ మురారీల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. 

ఎన్నికల సమయంలో నెరవేర్చలేని ఉచిత హామీలు ఇచ్చే పార్టీల గుర్తింపును రద్దు చేయాల‌న‌డం అప్రజాస్వామికమని ధర్మాసనం పేర్కొంది. అది అప్రజాస్వామికమైన ఆలోచన. మనము ప్రజాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ఉన్నామ‌ని తెలిపారు. అయితే, ఎన్నికల్లో ఉచిత హామీలు ఇవ్వటం తీవ్రమైన అంశమ‌నీ,  కానీ, చట్టపరమైన అడ్డుకట్ట వేసే వర‌కు వాటిపై జోక్యం చేసుకోలేమని సీజేఐ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు .

ఈ విష‌యంపై  ఇప్పటికే పలువురు న్యాయవాదులు కీల‌క‌ సూచనలు చేశారని, మిగిలిన వారు సైతం తన పదవీ విరమణలోపు సలహాలు ఇవ్వాలని  సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ కోరారు. ఉచితాలు, సంక్షేమ పథకాలు వేరు వేరు అనీ, ప్రజల సంక్షేమం మధ్య సమతుల్యత అవసరమ‌ని పేర్కొన్నారు. ఈ పిల్  తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేశారు.
 

PREV
click me!

Recommended Stories

చెన్నై లో నూతన భవనాలను ప్రారంభించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Visits Perambur
అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families