టైమ్స్ నౌ చీఫ్ ఎడిటర్ రాహుల్ శివశంకర్ ఛానెల్ నుండి తప్పుకున్నట్లు న్యూస్‌లాండ్రీ సమాచారం. దీనికి తోడు న్యూస్ యాంకర్ శివశంకర్ తన ట్విట్టర్ బయోని అప్ డేట్ చేయడం ఇది నిజమేనని నిరూపించేలా ఉంది. ఆయన తన బయోని "ఎడిటర్-ఇన్-చీఫ్ టైమ్స్ నౌ, 2016 నుండి 2023"అని అప్‌డేట్ చేశారు. "ప్రోగ్రెసివ్ కన్జర్వేటివ్ జర్నలిస్ట్" అని కూడా బయోలో మార్చారు.
మరోవైపు ఛానెల్ హెచ్ఆర్ విభాగం.. ఉద్యోగులకు పంపిన అంతర్గత కమ్యూనికేషన్‌లో... “టైమ్స్ నౌ ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ శివశంకర్ ఛానల్ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తక్షణం ఇబ్బందులు ఎదురవ్వకుండా.. ఛానెల్ కార్యకలాపాలు గ్రూప్ ఎడిటర్ నావికా కుమార్ ఆధ్వర్యంలో జరుగుతాయి. టైమ్స్ నౌ బృందంలోని అన్ని ఆపరేటింగ్ కంటెంట్ మేనేజర్‌లు నావికా కుమార్ కు రిపోర్ట్ చేయాలి’ అందరికీ పంపించింది.
భరణం ఇవ్వాలని ఆదేశిస్తే.. ఏడు బస్తాల నాణేలను ఇచ్చిన భర్త.. దిమ్మతిరిగే షాకిచ్చిన కోర్టు..
న్యూస్‌ఎక్స్ ఎడిటర్-ఇన్-చీఫ్ పదవికి రాజీనామా చేసిన శివశంకర్ 2016లో టైమ్స్ నౌ ఛానెల్‌లో చేరారు. టైమ్స్ నౌలో 8 పీఎం ప్రైమ్‌టైమ్ షోని హోస్ట్ చేస్తూ ప్రముఖ వ్యక్తిగా మారారు. వార్తా పరిశ్రమలో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న జర్నలిస్టు. హెడ్‌లైన్స్ టుడే, ఇండియా టుడేలలో కూడా పనిచేశారు.
రాహుల్ శివశంకర్, నవికా కుమార్ మధ్య పోటీ..
ప్రస్తుతం ఇంఛార్జ్ గా నియమితులైన నావికా కుమార్, రాహుల్ శివ్ శంకర్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. టైమ్స్ నౌలోని న్యూస్‌రూమ్ మీద కూడా ఈ ప్రభావం పడింది. దీనిమీద ఛానెల్‌కు చెందిన జర్నలిస్టులు కూడా ఈ రెండు గ్రూపులు ఉన్నట్టుగా ఒప్పుకున్నారు. ఇటీవల నావికా హిందీ ఛానల్ టైమ్స్ నవభారత్‌పై దృష్టి పెట్టడంతో.. రాహుల్‌కు తాత్కాలిక ఉపశమనం లభించింది. అయినప్పటికీ, నావికా అధికారం కొనసాగింది. రాహుల్ రాజీనామా వెనుక కారణం చిక్కుముడిగా మిగిలిపోయింది. దీనిమీద రాబోయే రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
వైరల్ 'మెక్ఆడమ్స్' గాఫే
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై జరిగిన చర్చలో శివశంకర్ షోకు సంబంధించిన ఒక డిబేట్ వీడియో వైరల్ అయింది. శివశంకర్ తన షోకు వచ్చిన ఒక గెస్ట్ ను లైవ్ లో ఒక నిమిషం కంటే ఎక్కువసేపు తిట్టాడు. అయితే, అతను అరవాల్సింది అతనిమీద కాదని.. రాంగ్ పర్సన్ మీద అరుస్తున్నాడని ఆ తరువాత గ్రహించాడు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై శివశంకర్ చర్చ నిర్వహిస్తున్నారు. అతిథులలో రాన్ పాల్ ఇన్‌స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డేనియల్ మక్‌ఆడమ్స్, కైవ్ పోస్ట్ చీఫ్ ఎడిటర్ బోహ్డాన్ నహయ్‌లో ఉన్నారు. ఒక సందర్భంలో, శివశంకర్ "డానియల్ మెక్ ఆడమ్స్"ని "కాస్త చిల్ పిల్ తీసుకో" అని అన్నాడు. "మెక్ ఆడమ్స్" ఉక్రెయిన్ మీద "భారతదేశాని ఉపన్యాసాలు ఇవ్వడం" గురించి చాలా ఆందోళన చెందుతున్నారు.. కాస్త కాళ్లు నేలమీద పెట్టి ఆలోచించండి.. అంటూ అన్నారు. ఆ తరువాత యాంకర్ "మెక్ ఆడమ్స్"పై విరుచుకుపడ్డాడు. అయితే, అప్పటివరకు అతను మాట్లాడింది మెక్ ఆడమ్స్ తో కాదన్న విషయం తరువాత అర్థం అయ్యింది.
మరోవైపు.. నిజమైన మెక్ ఆడమ్స్ విరుచుకుపడ్డాడు. "డియర్ హోస్ట్, నేను ఇంకా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీరు నా మీద ఎందుకు అరుస్తున్నారో నాకు తెలియదు" అని అన్నాడు. "నేను మీ మీద అరవడం లేదు. నేను మెక్ ఆడమ్స్ గురించి మాట్లాడుతున్నాను" అని శివశంకర్ బదులిచ్చాడు. "నేనే మెక్ ఆడమ్స్ ను! నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కాబట్టి నాపై అరవడం ఆపండి!" అని అరిచారు. దీంతో యాంకర్ క్షమాపణలు చెప్పారు. తాను పొరపడ్డానని చెప్పుకొచ్చారు.
శివశంకర్ నిష్క్రమణ.. అనేక ప్రశ్నలు..
టైమ్స్ నౌ నుండి రాహుల్ శివశంకర్ వైదొలిగినట్లు వార్తలు వెలువడటంతో, సోషల్ మీడియా వెబ్‌సైట్లలో ఊహాగానాలు మొదలయ్యాయి. జర్నలిస్ట్ రోహిణి సింగ్ ట్విటర్‌లో "నోయిడా ఛానెల్‌ల ద్వారా పెద్ద మార్పులు జరుగుతున్నాయి" అని పేర్కొన్నారు. శివశంకర్‌ను కూడా తొలగించినట్లు ఆమె సూచనప్రాయంగా తెలిపారు.
అయితే, ఈ సమాచారం వచ్చేసమయానికి, శివశంకర్ స్వచ్ఛందంగా రాజీనామా చేశారా లేదా ఛానెల్ తొలగించిందా అనే దానిపై స్పష్టత లేదు. కొద్ది రోజుల క్రితం, మరో ప్రముఖ ప్రైమ్ టైమ్ యాంకర్ రూబికా లియాకత్ కూడా ఏబీపీ వార్తల నుండి నిష్క్రమించారు.