భరణం ఇవ్వాలని ఆదేశిస్తే.. ఏడు బస్తాల నాణేలను ఇచ్చిన భర్త..  దిమ్మతిరిగే షాకిచ్చిన కోర్టు.. 

Published : Jun 21, 2023, 07:29 AM IST
భరణం ఇవ్వాలని ఆదేశిస్తే.. ఏడు బస్తాల నాణేలను ఇచ్చిన భర్త..  దిమ్మతిరిగే షాకిచ్చిన కోర్టు.. 

సారాంశం

Rajasthan: నోట్లకు బదులు నాణేలు ఇస్తే.. మీ స్పందన ఎలా ఉంటుంది? వంద రూపాయలో.. వెయ్యి రూపాయలో కాదు ఏకంగా రూ.55,000 మొత్తాన్ని నాణేల రూపంలో ఇస్తే ఎలా ఉంటుంది. ఎవ్వరికైనా ఒళ్లు మండుతోంది కాదా.. జైపూర్‌లోని ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తికు  ఇలాంటి ఘటననే ఎదురైంది.

Rajasthan: నోట్లకు బదులు నాణేలు ఇస్తే.. మీ స్పందన ఎలా ఉంటుంది? వంద రూపాయలో.. వెయ్యి రూపాయలో కాదు ఏకంగా రూ.55,000 మొత్తాన్ని నాణేల రూపంలో ఇస్తే ఎలా ఉంటుంది. ఎవ్వరికైనా ఒళ్లు మండుతోంది కాదా.. జైపూర్‌లోని ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తికు  ఇలాంటి ఘటననే ఎదురైంది. ఇంత మొత్తాన్ని నాణేల రూపంలో చూసి జడ్జి కూడా పళ్లు బిగించాడు. నిందితుడు తగిన బుద్ది చెప్పారు. ఇంతకీ అంత డబ్బును  జడ్జి ముందు ఉంచాల్సిన సందర్భమేంటని అనుకున్నారా..?  అయితే.. ఈ కథనాన్ని ఓ సారి చదివేసేయండి.

ఓ భార్య తన భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఈ క్రమంలో తన భార్యకు పోషణ నిమిత్తం ప్రతినెలకు రూ 5,000 లను భరణంగా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కానీ, సదరు వ్యక్తి గత 11 నెలలుగా భరణం చెల్లించకుండా తప్పించుకున్నాడు. దీంతో అతని భార్య కోర్టును ఆశ్రయించింది. దీనిని విన్న న్యాయస్థానం భర్తను జైలుకు పంపాలని, బకాయి ఉన్న భరణం మొత్తాన్ని (రూ. 55,000) భార్యకు చెల్లించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నిందితుడు  55 వేల నాణేలను బాక్సుల్లో నింపి కోర్టుకు చేరుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన న్యాయమూర్తి ఆ మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరిస్తూనే.. నాణేలను భర్తనే స్వయంగా లెక్కించాలని ఆదేశించారు.  

వివరాల ప్రకారం.. రాజస్థాన్ లోని జైపూర్‌కు చెందిన దశరథ్ కుమావత్, సీమా అనే మహిళను  10 సంవత్సరాల ముందు వివాహం చేసుకున్నారు. పెళ్లయిన మూడు నాలుగు నెలలకే ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. గొడవ తీవ్రరూపం దాల్చడంతో భర్త విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. కేసును విచారించిన కుటుంబ న్యాయస్థానం.. సీమాకు ప్రతి నెలా రూ. 5 వేలను భరణంగా చెల్లించాలని ఆదేశించింది.  అయితే.. 11 నెలలుగా అతడు భరణం చెల్లించడం లేదు. దీంతో సీమా  మళ్లీ కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు అతనిపై 
రికవరీ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలో జూన్ 17 న అతడ్ని పోలీసులు అరెస్టు  చేసి సోమవారం కోర్టుకు తరలించారు.

ఆ మొత్తాన్ని చెల్లించిన కోర్టు దశరథ్‌ను బెయిల్‌పై విడుదల చేసింది. విడుదలకు ముందు దశరథ్  కోర్టులో నాణేలను సమర్పించారు.నాణేల బరువు దాదాపు 280 కిలోలు. ఇది మానవత్వం కాదని సీమ తరపు న్యాయవాది రాంప్రకాష్ అన్నారు. దశరథ్ 11 నెలలుగా నిర్వహణ మొత్తాన్ని చెల్లించడం లేదు. ఇప్పుడు సీమను ఇబ్బంది పెట్టేందుకు నాణేలు తెచ్చాడు. వాటిని లెక్కించడానికి 10 రోజులు పడుతుందని సీమ తరపు న్యాయవాది  తన వాదన వినిపించారు. అదే సమయంలో ఇది చెల్లుబాటు అయ్యే భారతీయ కరెన్సీ అని భర్త తరఫు న్యాయవాది తన వివరణలో తెలిపారు.  .

ఇరు వర్గాల వాదన విన్న న్యాయమూర్తి.. ఆ మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరిస్తూనే.. ఓ షరతు పెట్టారు. ఆ నాణేలను తదుపరి విచారణ వరకు(జూన్ 26) భర్తనే స్వయంగా లెక్కించాలని ఆదేశించారు. ఈ నాణేలను లెక్కించి రూ. 1000 వంతున ప్యాకెట్లుగా  సిద్ధం చేసి భార్యకు ఇవ్వాలని కోర్టు భర్తను ఆదేశించారు. అంతవరకు ఆ మొత్తాన్ని కోర్టు కస్టడీలోనే ఉంచాలని ఆదేశించారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్