యువతిని కొట్టి చంపిన ప్రియుడు...!

Published : Dec 14, 2022, 11:23 AM IST
 యువతిని కొట్టి చంపిన ప్రియుడు...!

సారాంశం

నిందితుడు తన ప్రియురాలు రేషామి సాహుపై కర్రతో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడని ధామ్‌తరి పోలీస్ సూపరింటెండెంట్ ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు.

ఓ యువకుడు... తన ప్రియురాలిని దారుణంగా కొట్టి చంపాడు. ఈ సంఘటన ఛత్తీస్ గఢ్ లో చోటుచేసుకోగా.... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్‌తరి జిల్లాలో టీ స్టాల్‌లో 25 ఏళ్ల మహిళను ఆమె ప్రియుడు కొట్టి చంపినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. జిల్లాలోని మగర్‌లోడ్ పట్టణంలోని బాధితురాలి టీ స్టాల్‌లో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుందని ఓ అధికారి తెలిపారు. నిందితుడు తన ప్రియురాలు రేషామి సాహుపై కర్రతో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడని ధామ్‌తరి పోలీస్ సూపరింటెండెంట్ ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు.

సాహు జీవనోపాధి కోసం మగర్‌లోడ్ నగర్ పంచాయతీ కార్యాలయం సమీపంలో టీ స్టాల్ నడుపుతోంది, నిందితుడు మగర్‌లోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిసోరా గ్రామానికి చెందినవాడని ఆయన తెలిపారు.

తలకు గాయాలై రక్తపు మడుగులో పడి ఉన్న మహిళ సాహును గుర్తించిన గ్రామస్థులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.మహిళను సమీపంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.

నిందితుడికి, బాధితురాలికి నాలుగేళ్లుగా సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఘటన జరిగిన రోజు వారి  మధ్య గొడవలు జరిగినట్లు అధికారులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

జూలై 1 నుంచి రైల్వే కొత్త రూల్స్... | Indian Railways New Rules from July 1 | Asianet News Telugu
Alcohol: మందుబాబుల‌కు కిక్కిచ్చే న్యూస్‌.. ఖాళీ సీసాలు ఇస్తే డ‌బ్బులిస్తారు, ఒక్కో బాటిల్‌కు ఎంతంటే.?