గుండెపోటుతో చత్తీస్‌ఘడ్ గవర్నర్ మృతి

By Arun Kumar PFirst Published Aug 15, 2018, 1:25 PM IST
Highlights

చత్తీస్ ఘడ్ సీఎం బలరాంజీ టాండన్(90) మంగళవారం తుది శ్వాస విడిచారు. గవర్నర్ కార్యాలయంలో ఉండగానే టాండన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది రాయ్ పూర్ లోని అంబేద్కర్ మొమోరియల్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ టాండన్ మృతిచెందారు. గెంబెపోటుతో బలరామ్‌జీ మృతిచెందినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ వివేక్‌చౌదరి తెలిపారు.

చత్తీస్‌ఘడ్ సీఎం రమణ్ సింగ్ వెంటనే ఆస్పత్రికి చేరుకుని గవర్నర్ మృతదేహానికి నివాళి అర్పించారు.  ఆయన మృతికి సంతాపంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కూడా ప్రభుత్వం ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు లేకుండా నిర్వహించింది. అంతేకాకుండా ఏడు రోజుల పాటు రాష్ట్రంలో సంతాప దినాలను ప్రభుత్వం ప్రకటించింది. 

బిజెపి మాతృసంస్థ జన సంఘ్ వ్యవస్థాప సభ్యుల్లో బలరాంజీ టాండన్ ఒకరు. ఈయన పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. పంజాబ్ ఉపముఖ్యమంత్రిగా కూడా ఈయన పనిచేశారు. అయితే ఇతడి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం 2014 లో చత్తీస్‌ఘడ్ గవర్నర్ గా నియమించింది.  అప్పటినుండి ఇప్పటివరకు ఆయన ఈ రాష్ట్ర గవర్నర్ గానే కొనసాగుతున్నారు.

బలరాంజీ టాండన్ అకాల మృతికి ప్రధానిమోదీ, రాష్ట్రపతి రామ్ పాథ్ కోవింద్ నివాళులు అర్పించారు.  మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కు చత్తీస్‌ఘడ్ గవర్నర్ బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు.   

click me!