ఆప్ కు సీనియర్ నేత అశుతోష్ గుడ్ బై

By sivanagaprasad KodatiFirst Published Aug 15, 2018, 1:12 PM IST
Highlights

ఆమ్‌ ఆద్మీ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. వరుసగా సీనియర్ నేతలు పార్టీ వీడుతున్నారు. కొన్నాళ్ల క్రితం పార్టీ సీనియర్ నేత వ్యవస్థాపకుల్లో ఒకరైన కుమార్ విశ్వాస్ పార్టీకి రాజీనామా చేశారు.  ఆ విషయం మరవకముందే పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన సీనియర్‌ నేత అశుతోష్‌ పార్టీకి  ఆప్ కి రాజీనామా చేశారు.

ఢీల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. వరుసగా సీనియర్ నేతలు పార్టీ వీడుతున్నారు. కొన్నాళ్ల క్రితం పార్టీ సీనియర్ నేత వ్యవస్థాపకుల్లో ఒకరైన కుమార్ విశ్వాస్ పార్టీకి రాజీనామా చేశారు.  ఆ విషయం మరవకముందే పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన సీనియర్‌ నేత అశుతోష్‌ పార్టీకి  ఆప్ కి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీలో స్థబ్ధుగా ఉంటున్న అశుతోష్ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రతి ప్రయాణానికి ముగింపు ఉంటుంది. ఆమ్‌ ఆద్మీ పార్టీతో నా అనుబంధం చాలా అందమైంది. విప్లవాత్మకమైనది. దీనికి కూడా ముగింపు ఉంటుంది. అందుకే పార్టీకి రాజీనామా చేశాను. నా రాజీనామాను అంగీకరించాలని కోరినట్లు అశుతోష్ వెల్లడించారు. వ్యక్తిగతమైన కారణాల వల్ల తప్పుకుంటున్నానని పార్టీకి, నాకు ఇన్నాళ్లు మద్దతుగా నిలిచిన వారందరికీ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. 

అశుతోష్ రాజకీయాల్లోకి రాకముందు జర్నలిస్ట్ గా పనిచేశారు. సీనియర్ జర్నలిస్టులలో ఒకరైన అశుతోష్ అన్నాహజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యారు. ఆ తర్వాత ఆప్ లో చేరారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీలోని చాందినీ చౌక్‌ నుంచి  పోటీ చేసి బీజేపీ నేత హర్షవర్ధన్ చేతిలో ‌ఓటమిపాలయ్యారు. 

ఓటమి అనంతరం రాజ్యసభ సీటు కోసం ప్రయత్నించారు. అయితే సీఎం కేజ్రీవాల్ అవకాశం ఇవ్వకపోవడంతో అశుతోష్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సీనియర్ నేతల వరుస రాజీనామాలతో ఆప్ లో ఆందోళన మెదలైంది. 

click me!