లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్: యువకుడిని చెంపపై కొట్టిన కలెక్టర్‌‌కి ప్రభుత్వం షాక్

By narsimha lodeFirst Published May 23, 2021, 4:11 PM IST
Highlights

:లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారనే నెపంతో ఓ వ్యక్తి చెంపపై కొట్టడమే  పోలీసులతో  కొట్టించిన కలెక్టర్ ను బదిలీ చేశారు ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్ భగల్.లాక్‌డౌన్‌ రూల్స్‌ పేరుతో ఓ వ్యక్తితో దురుసుగా ప్రవర్తించిన ఛత్తీస్‌ఘడ్‌ కలెక్టర్‌ వ్యవహారం ట్విట్టర్‌ను కుదిపేస్తోంది. మందులు కొనడానికి వెళ్లిన ఆ వ్యక్తిపై కలెక్టర్‌ చెయ్యి చేసుకోవడంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు.

రాయ్‌పూర్:లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారనే నెపంతో ఓ వ్యక్తి చెంపపై కొట్టడమే  పోలీసులతో  కొట్టించిన కలెక్టర్ ను బదిలీ చేశారు ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్ భగల్.లాక్‌డౌన్‌ రూల్స్‌ పేరుతో ఓ వ్యక్తితో దురుసుగా ప్రవర్తించిన ఛత్తీస్‌ఘడ్‌ కలెక్టర్‌ వ్యవహారం ట్విట్టర్‌ను కుదిపేస్తోంది. మందులు కొనడానికి వెళ్లిన ఆ వ్యక్తిపై కలెక్టర్‌ చెయ్యి చేసుకోవడంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు.

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని సూరజ్‌పూర్ జిల్లా కలెక్టర్ రణభీర్ శర్మను  బదిలీ చేస్తూ ఆదివారం నాడు సీఎం నిర్ణయం తీసుకొన్నారు. రణబీర్‌ శర్మను సెక్రటేరియట్‌కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో రాయ్‌పూర్ జిల్లా పంచాయితీ సీఈఓ గౌరవ్ కుమార్ సింగ్ ను జిల్లా కలెక్టర్ గా నియమిస్తూ ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

 

Chhattisgarh | In a viral video, Surajpur District Collector Ranbir Sharma was seen slapping a person and slamming his phone on the ground, for allegedly violating lockdown guidelines pic.twitter.com/z4l0zkdy7C

— ANI (@ANI)

ఐఎఎస్ అధికారుల అసోసియేషన్ కూడ రణబీర్ శర్మ ప్రవర్తనను తీవ్రంగా ఖండించింది. ఈ రకమైన ప్రవర్తన ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది. నాగరిక ప్రాథమిక సిద్దాంతాలకు విరుద్దంగా కలెక్టర్ వ్యవహరించారని అసోసియేషన్ అభిప్రాయపడింది. ఈ మేరకు తమ అభిప్రాయాన్ని అసోసియేషన్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. 

మూడు నిమిషాల నిడివి ఉన్న వీడియోలో  ఓ వ్యక్తిని లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని కలెక్టర్ కొట్టారు. అంతేకాదు అక్కడే ఉన్న పోలీసులతో కూడ కొట్టాలని ఆదేశించారు.  ఆ వ్యక్తిపై కలెక్టర్ పరుష పదజాలం ఉపయోగించారు. 23 ఏళ్ల యువకుడు స్పోర్ట్స్ బైక్ పై అతి వేగంగా వెళ్తున్నాడు. కలెక్టర్‌తో పాటు పోలీసులు ఆపినా కూడ అతను ఆగలేదు. ఈ సమయంలో పోలీసులు అతడిని కొద్ది దూరం వెళ్లిన తర్వాత నిలిపివేశారు. టీకా వేసుకొనేందుకు వెళ్తున్నట్టుగా ఆ యువకుడు నకిలీ ధృవ పత్రం చూపాడని కలెక్టర్ కొట్టాడు. 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో కలెక్టర్  రణబీర్ శర్మ  ట్విట్టర్ వేదికగా మరో వీడియోను విడుదల చేశాడు. తన ప్రవర్తనపై ఆయన క్షమాపణలు చెప్పాడు. తన తల్లిదండ్రులతో పాటు తాను ఇటీవలనే కరోనా నుండి కోలుకొన్నట్టుగా ఆయన తెలిపారు. రాయ్‌పూర్ కు 357 కి.మీ దూరంలో  సూరజ్‌పూర్‌ లో 25,647 కరోనా కేసులు రికార్డయ్యాయి. 187 మంది కరోనాతో మరణించారు. 
 

click me!