అటు భార్య, ఇటు ప్రియురాలు.. ఇద్దరికీ విషం ఇచ్చి..

Published : Jun 11, 2019, 01:47 PM IST
అటు భార్య, ఇటు ప్రియురాలు.. ఇద్దరికీ విషం ఇచ్చి..

సారాంశం

అతనికి పెళ్లై.. భార్య, పిల్లలు ఉన్నారు. జీవితం సంతోషంగా సాగుతుందనుకున్న సమయంలో... మరో యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. 

అతనికి పెళ్లై.. భార్య, పిల్లలు ఉన్నారు. జీవితం సంతోషంగా సాగుతుందనుకున్న సమయంలో... మరో యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి భార్య... ఇద్దరినీ ఎంత మందలించినా... పోలీసులతో కౌన్సిలింగ్ ఇప్పించినా కూడా అతనిలో మార్పు రాలేదు. చివరకు భార్య, ప్రియురాలు ఇద్దరినీ వదులుకోవడం ఇష్టం లేక... ఇద్దరికీ విషం ఇచ్చి.. తాను విషయం తాగాడు. అతను చనిపోగా... భార్య, ప్రియురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కరుంగల్ సమీపంలోని మాంగరై ప్రాంతానికి చెందిన జయన్(30) కి భార్య పునితా రాణి(29), కుమార్తె జేసేబి(6) ఉన్నారు. కాగా... కొంతకాలం క్రితం జయన్ కి శరణ్య(21) అనే యువతితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో రెండు సార్లు వీరు ఇంటి నుంచి పరారయ్యారు కూడా. కాగా వాళ్లకి పోలీసులు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయినా వారిలో మార్పు రాలేదు.

భర్త ప్రవర్తనతో విసిగిపోయిన పునితా రాణి... కుమార్తెతో కలిసి వేరే ప్రాంతానికి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుంది. జయన్ తాను, తన ప్రేయసి శరణ్య కూడా వస్తామని భార్యను కోరాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో... చనిపోతానని బెదిరించాడు. దీంతో ఆమె అంగీకరించింది. ఇటీవల జయన్, పునితా రాణి, శరణ్య, జేసేబీలు చెన్నై చేరుకొని అక్కడ ఓ లాడ్జి తీసుకున్నారు.

అక్కడికి వెళ్లాక... నలుగురు విషయం తాగి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన హోటల్ యాజమాన్యం వాళ్లని ఆస్పత్రికి తరలించగా... జయన్ కన్నుమూశాడు. మిగిలిన వారు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu
Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!