మళ్లీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ములాయం

By telugu teamFirst Published Jun 11, 2019, 12:00 PM IST
Highlights

సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రిలో చేర్పించారు. 

సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రిలో చేర్పించారు. ఒక్కసారిగా ఆయన షుగర్ లెవల్స్ అధికంగా నమోదవ్వడంతో ఆదివారం లక్నోలోని లోహియా ఆస్పత్రిలో చేర్పించారు. 

ఆరోగ్యం కుదుటపడటంతో.. సోమవారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. తీరా ఇంటికి తీసుకువచ్చాక సోమవారం రాత్రి ఆయన మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో... స్పెషల్ ఫ్లైట్ లో ఆయనను గురుగ్రామ్ లోని ఆస్పత్రికి తరలించారు.  కాగా.. ములాయం ఆరోగ్య పరిస్థితిపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్  ఆరా తీశారు.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ములాయం సింగ్ యాదవ్ యూపీలోని మెయిన్‌పూరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రేమ్ సింగ్ శక్యాపై 94 వేల ఓట్ల మెజార్టీతో ములాయం విజయం సాధించారు. 

click me!