ఫేక్ పోలీసు... ఏడు పెళ్లిళ్లు చేసుకొని.. మరో ఆరుగురిని...

By telugu teamFirst Published Sep 16, 2019, 12:47 PM IST
Highlights

ఒకరు కాదు ఇద్దరు కాదు... ఏడుగురిని పెళ్లి చేసుకున్నాడు. మరో ఆరుగురు అమ్మాయిలను లైంగికంగా వేధించాడు. ఇదంతా కేవలం రెండు సంవత్సరాల్లోనే చేశాడు. చివరకు అతని ఆగడాలన్నీ అసలు సిసలైన పోలీసులకు తెలిసిపోయింది. దీంతో ఈ ఫేక్ పోలీసు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది.

అతను కనీసం ఏడో తరగతి కూడా పాస్ కాలేదు. కానీ అందరికీ తాను ఒక పోలీసు అని చెప్పి నమ్మించాడు. అక్కడితో ఆగలేదు. తానొక ఎన్ కౌంటర్ స్పెషలిస్టు అని అందరికీ చెప్పేవాడు. ఈ మాటలు చెప్పి నమ్మించే.. ఒకరు కాదు ఇద్దరు కాదు... ఏడుగురిని పెళ్లి చేసుకున్నాడు. మరో ఆరుగురు అమ్మాయిలను లైంగికంగా వేధించాడు. ఇదంతా కేవలం రెండు సంవత్సరాల్లోనే చేశాడు. చివరకు అతని ఆగడాలన్నీ అసలు సిసలైన పోలీసులకు తెలిసిపోయింది. దీంతో ఈ ఫేక్ పోలీసు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రం తిర్పూర్ కి చెందిన రాజేష్ పృథ్వీ(42) పోలీసుగా చలామణి అవుతున్నాడు. తాను పోలీసు అని చెప్పి ఏడుగురు మహిళలను పెళ్లి చేసుకున్నాడు. మరో ఆరుగురు యువతులను లైంగికంగా వేధించాడు. కాగా... బాధిత మహిళల ఫిర్యాదుతో అతని ఆగడాలన్నీ వెలుగులోకి వచ్చాయి. పోలీసు యూనిఫాం వేసుకొని ఫోటో దిగి... వాటిని అందరికీ చూపిస్తూ నమ్మించేవాడు. 

అంతేకాకుండా... మెడికల్ సీట్లు ఇప్పిస్తానంటూ కూడా పలువురిని మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దాదాపు రూ.30లక్షలకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. చాలా మందికి ఉద్యోగాలు ఇస్తానని కూడా నమ్మించి డబ్బు వసూలు చేసినట్లు తేలింది. ఒక్క ఫిర్యాదు తో ఆయన చేసిన అన్ని నేరాలు బయటకు వచ్చాయని పోలీసులు చెప్పారు. 
 

click me!