మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులు.. ఎదురించినందుకు దాడి చేసి..!

Published : Sep 20, 2021, 11:21 AM ISTUpdated : Sep 20, 2021, 11:24 AM IST
మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులు.. ఎదురించినందుకు దాడి చేసి..!

సారాంశం

బాలుడు ఉదయం స్కూల్ కి వెళ్లేవాడు.. సాయంత్రం స్నాక్స్ అమ్ముకొని కుటుంబానికి అండగా ఉండేవాడు. కాగా.. బాలుడు ఇటీవల సాయంత్రం.. థియేటర్ సమీపంలోని ఓ దుకాణానికి స్నాక్స్ అమ్ముకోవడానికి వెళ్లాడు.

ఓ మైనర్ బాలుడిపై గ్యాంగ్ దాడికి పాల్పడింది.  తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ చిన్నారి పై నలుగురు వ్యక్తులతో కూడిన ఓ ముఠా లైంగికంగా దాడికి చేసింది. వారి దాడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడని.. ఆ బాలుడిని తీవ్రంగా గాయపరిచారు. ఈ క్రమంలో.. తీవ్ర గాయాలపాలైన ఆ బాలుడు.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం చెన్నైలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కాగా.. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నలుగురిని అదుపులోకి తసీుకున్నవారు. వారిలో  ఓ మైనర్ బాలుడు కూడా ఉండటం గమనార్హం. బాధిత బాలుడు.. అక్కడి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో  తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. బాలుడు ఉదయం స్కూల్ కి వెళ్లేవాడు.. సాయంత్రం స్నాక్స్ అమ్ముకొని కుటుంబానికి అండగా ఉండేవాడు. కాగా.. బాలుడు ఇటీవల సాయంత్రం.. థియేటర్ సమీపంలోని ఓ దుకాణానికి స్నాక్స్ అమ్ముకోవడానికి వెళ్లాడు.

ఈ శనివారం సాయంత్రం కూడా.. రోజూలాగానే.. థియేటర్  వద్ద స్నాక్స్ అమ్మడానికి వెళ్లాడు. అయితే.. తిరిగి ఇంటికి రాలేదు. దీంతో.. కుటుంబసభ్యులు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు బాలుడి కోసం గాలించగా.. తీవ్రంగా గాయపడి కనిపించాడు. వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా... బాలుడిపై లైంగిక దాడికి ప్రయత్నించగా.. అడ్డుకోవడంతో  ఇలా దాడి చేసిన్టలు తర్వాత దర్యాప్తులో తేలడం గమనార్హం.
 

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్