
చెన్నై నగరంలో యువతులు మద్యం మత్తులో హల్చల్ చేశారు. శనివారం రాత్రి తిరువల్లికేణి వాలాజా రోడ్డులో ముగ్గురు మహిళలు బీభత్సం సృష్టిస్తున్నారని చెన్నైలోని పోలీసులకు కంట్రోల్ రూమ్ ద్వారా సమాచారం అందింది. మహిళలు మద్యం సేవించి.. బాటసారులతో హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. సంఘటనా స్థలానికి చేరుకుని చూసే సరికి చెన్నై సిటీ బస్సు కింద ముగ్గురు మహిళలు పడుకొని ఉన్నారు. దీంతో షాక్‌కు గురైన మహిళా పోలీసులు బస్సు కింద ఉన్న ముగ్గురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
రాత్రి పెట్రోలింగ్‌లో ఉన్న మహిళా ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మహిళలను శాంతింపజేశారు. కానీ, వారు అంతటితో ఆగకుండా యువతులు రోడ్డుపై బైఠాయించి బీభత్సం సృష్టించారు. మహిళ పోలీసులు పరిస్థితిని సద్దుమణిగేలా ప్రయత్నించినా ఆ యువతులు సహకరించలేదు. ఎట్టకేలకు పోలీసులు ఆ ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకుని డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. పోలీసులు విచారించగా.. ఆ యువతులు కన్నగి నగర్ ప్రాంతానికి చెందిన వారని, తిరువల్లికేణిలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైనట్టు పోలీసులు గుర్తించారు.
పోలీసుల అదుపులో యువతులు .. విచారణ జరిపిన పోలీసులు ముగ్గురు బాలికలను కన్నగి నగర్‌లోని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ముగ్గురు యువతులపై పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలను ఈ ఘటన తెలియజేస్తోంది. మహిళలు తమను తాము ప్రమాదంలో పడేసుకోవడమే కాకుండా.. రోడ్డుపై హింసాత్మకంగా ప్రవర్తించడం ద్వారా ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. పోలీసులు వెంటనే స్పందించి ఆ యువతులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.