దొంగ నిజాయితీకి నెటిజన్లు ఫిదా.. ‘ఆశీర్వాదం పొందిన సార్’.. పోలీసుల ప్రశ్నలకు దొంగ సమాధానాలు.. (వీడియో)

By Mahesh KFirst Published Dec 4, 2022, 6:14 PM IST
Highlights

ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఓ దొంగ పోలీసులకు చాలా నిజాయితీగా సమాధానం చెప్పాడు. తాను దొంగిలించిన మొత్తం రూ. 10 వేలు అని సమాధానం చెప్పి చోరీని అంగీకరించాడు. అంతేకాదు, వాటిని పేదలకు పంచిపెట్టానని, తనకు వారి ఆశీర్వాదం ఉన్నదని అన్నాడు.
 

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఓ దొంగ నిజాయితీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దొంగను పట్టుకుని పోలీసు స్టేషన్‌లో అధికారులు కొన్ని ప్రశ్నలు వేయగా.. అతడు సమాధానాలు చెప్పాడు. దొంగతనం చేసినట్టు అంగీకరించాడని, రూ. 10 వేలు దొంగిలించినట్టూ ఒప్పుకున్నాడు. దొంగతనాన్ని అంగీకరించిన ఆ చోరుడు పలు ప్రశ్నలకు చెప్పిన సమాధానాలు ఆసక్తిగా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోను తొలిగా భిలాయ్ టైమ్స్ షేర్ చేసింది. జిందగీ గుల్జార్ హై అనే పేజీ ఈ వీడియోను పోస్టు చేయగా.. వైరల్‌గా మారింది.

ఛత్తీస్‌గడ్‌లోని దుర్గ్‌లో ఓ పోలీసు స్టేషన్‌లో దొంగను విచారించిన వీడియో క్లిప్‌లో ఇలా ఉన్నది. దుర్గ్ ఎస్పీ డాక్టర్ అభిషేక్ పల్లవ దొరికించుకున్న దొంగను ప్రశ్నించారు. చోరీ తర్వాత ఎలా అనిపించింది? అని దొంగను ప్రశ్నించారు. దొంగతనం చేసిన తర్వాత మంచిగానే అనిపించిందని, కానీ, పశ్చాత్తాపం కూడా కలిగింది సార్ అని సమాధానం ఇచ్చాడు. పశ్చాత్తాపం కలిగిందా? ఎందుకు? అని పోలీసు అడిగారు. తప్పు పని చేసేశాను సార్.. అని సమాధానం ఇచ్చాడు. దొంగిలించిన వాటితో ఎంత వరకు లభించింది? అని పోలీసు అడిగారు. తాను రూ. 10 వేలు దొంగిలించానని దొంగ సమాధానం ఇచ్చాడు. వాటిని పేదలకు పంచేసినట్టూ పేర్కొన్నాడు. ఆవులు, ఇతర జంతువుల కోసం ఖర్చు పెట్టాడని, రోడ్డుపై పడుకునే పేదలకు దుప్పట్లు వగైరా కొనుగోలు చేసి పంచిపెట్టానని తెలిపాడు. 

Also Read: పూజలో కూర్చునే హార్ట్‌ ఎటాక్‌తో మరణించిన భక్తుడు.. మధ్యప్రదేశ్ గుడిలో ఘటన (వీడియో)

దీనికి రియాక్ట్ అవుతూ అలాగైతే ఆశీర్వాదం లభించి ఉంటుంది? అని పోలీసు పేర్కొన్నాడు. ఆశీర్వాదం అయితే ఉన్నది సార్ అని ఆ దొంగ సమాధానం చెప్పాడు. ఈ సమాధానంతో ఆ గదిలో ఉన్న ఇతరులు అందరూ నవ్వారు.

ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు సంధించారు. ఈ మనిషి నిజాయితీని మెచ్చుకోవాల్సిందే అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఈ మనిషి తన రాబిన్‌హుడ్ యాంగిల్ చూపిస్తే పోలీసులు వదిలిపెడతారేమో అని దొంగ భావించాడేమో అని మరో యూజర్ పేర్కొన్నాడు. రాజకీయ నేతలు, ఉద్యోగులు, పోలీసులు ఈ సాధారణ మనిషి నుంచి నేర్చుకోవాలని, అవినీతి ద్వారా ఆర్జించవద్దని, రెండోది రాబిన్‌హుడ్ టైప్‌లో ఉండాలని ఇంకో యూజర్ పేర్కొన్నాడు.

click me!