నా భార్యకు క్షమాపణలు చెబుతూ ఓ లేఖ రాయ్.. చాట్‌జీపీటీని అడిగాడు.. ఏమని రాసిందంటే?

Published : Jul 30, 2023, 02:55 PM IST
నా భార్యకు క్షమాపణలు చెబుతూ ఓ లేఖ రాయ్.. చాట్‌జీపీటీని అడిగాడు.. ఏమని రాసిందంటే?

సారాంశం

ఓ వ్యక్తి చాట్ జీపీటీని తన వ్యక్తిగత పనికి ఉపయోగించాడు. తన భార్యకు క్షమాపణలు చెబుతూ ఓ లేఖ రాయాలని కోరాడు. తొలుత తిరస్కరించినా ఎట్టకేలకు ఓ లేఖ రాసిపెట్టింది. ఈ లేఖ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో ఆయన పోస్టు చేయగా నెటిజన్లు దుమ్మెత్తిపోశారు.  

న్యూఢిల్లీ: అధునాతన సాంకేతికత వేగంగా ప్రజల్లోకి వెళ్లుతున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వ్యక్తిగత జీవితాల్లోకీ చొచ్చుకువస్తున్నది. ముఖ్యంగా చాట్ జీపీటీ పై ఆధారపడటం పెరిగిపోతున్నది. వివరాలు, సందేహాలను సంపూర్ణంగా.. ఎలాంటి గజిబిజీ లేకుండా చాట్ జీపీటీ ద్వారా తెలుసుకుంటున్నారు. అయితే, ఓ వ్యక్తి ఈ కృత్రిమ మేధ సాంకేతికతను తన వ్యక్తిగత వ్యవహారానికి వాడుకున్నాడు. తన భార్యకు క్షమాపణలు చెబుతూ ఓ లేఖ రాయాలని చాట్ జీపీటీని కోరాడు. తొలుత ఈ కోరికను చాట్ జీపీటీ తిరస్కరించింది. కానీ, ఆ తర్వాత ఓ అపాలజీ లెటర్ రాసింది. ఆ వ్యక్తి చాట్ జీపీటీ రాసిన అపాలజీ లెటర్‌ను రెడ్డిట్‌లో పోస్టు చేశాడు.

ఆ వ్యక్తి తన భార్యకు చెప్పకుండా పిల్లలను తీసుకుని బయటికి వెళ్లాడు. అలా బయటికి వెళ్లినప్పుడు భార్యకు చెప్పలేనందున క్షమాపణలు చెబుతూ లేఖ రాయాలని చాట్ జీపీటీని కోరాడు. దీనికి చాట్ జీపీటీ ఇలా రాసుకొచ్చింది. ‘స్వీట్ హార్ట్, పిల్లలతో కలిసి బయటికి వెళ్లాలనే నా ప్లాన్‌ను నీకు చెప్పలేనందుకు క్షమాపణలు చెబుతున్నాను. అసలు ఏ ప్రణాళికలు వేసినా ముందుగా నీకు చెప్పాల్సింది. ఇలా చేసినందుకు నీపట్ల తప్పుగా వ్యవహరించానని, నిన్ను గౌరవించలేదని నేను రియలైజ్ అయ్యాను. అందుకే క్షమాపణలు చెబుతున్నాను. భవిష్యత్‌లో మరింత అర్థం చేసుకునే వ్యక్తిగతా నీతో ఇంకా ఎక్కువగా కమ్యూనికేట్ చేస్తాను. అడ్వాన్స్‌గా నా క్షమాపణలు’ అని ఆ టూల్ లెటర్ రాసింది.

ఒక వేళ తన లెటర్‌కు కూడా భార్య స్పందించకుంటే ఎలా అనే డౌట్ వచ్చింది. దీనికి కూడా ఒక వివరణ ఇవ్వాలని చాట్ జీపీటీ టూల్‌ను అడిగాడు. ఒక చిన్న మెస్సేజీ పంపించాలని పేర్కొంది. ఆ మెస్సేజీ ఇలా ఉండాలని పంపింది. నువ్వు ఏం చేస్తున్నావో, ఎలా ఉన్నావో చూడాలని అనుకుంటున్నాను. నేను చేయగలిగే సహాయం ఏది ఉన్నా చెప్పు. ఏది కావాలన్నా అడుగు. నేను నిన్ను ఇష్టపడుతున్నా అంటూ రాయాలని తెలిపింది.

Also Read: ప్ర‌ధాని మోడీ నాయకత్వంలో భార‌త్ సెమీకండక్టర్ ఆశయాలను సాధించే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది: రాజీవ్ చంద్రశేఖర్

చాట్ జీపీటీ రాసిన ఈ వివరణల స్క్రీన్ షాట్లను తీసి రెడ్డిట్‌లో పోస్టు చేశాడు. ఆయన పోస్టుపై చాలా మంది నెటిజన్లు ఆగ్రహించారు. తన భార్యకు క్షమాపణలు చెప్పే వ్యక్తిగత విషయానికి కూడా మెషీన్ వాడటాన్ని నిరసించారు. తన హృదయం నుంచి ఆ క్షమాపణలు రావాలని, అలా చేయడం లేదంటే భార్యను మోసం చేస్తున్నట్టే అంటూ మరో యూజర్ పేర్కొన్నారు. 

కాగా, చిర్రెత్తుకొచ్చిన ఇంకో యూజర్.. చాట్ జీపీటీని నువ్వు లెటర్ రాయాలని అడగాల్సింది కాదని, ధైర్యం కావాలని అడగాల్సిందని మండిపడ్డారు.

PREV
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu