భారీవర్షాలు, వరదల ఎఫెక్ట్: చార్‌థామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

Published : Aug 14, 2023, 06:39 PM ISTUpdated : Aug 14, 2023, 06:52 PM IST
భారీవర్షాలు, వరదల ఎఫెక్ట్:  చార్‌థామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

సారాంశం

చార్‌థామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.  భారీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

న్యూఢిల్లీ:  భారీ వర్షాలు, వరదలతో  చార్‌థామ్  యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని  అధికారులు సోమవారంనాడు నిలిపివేశారు.ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున  చార్ థామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు  నిర్వహణ అథారిటీ ఆదేశించినట్టుగా  అధికారులు సోమవారంనాడు తెలిపారు.యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా   ఉత్తరాఖండ్ అధికారులు చెప్పారు.

ఉత్తరాఖండ్ లో  భారీ వర్షాల కారణంగా  కొండ చరియలు  విరిగిపడడంతో పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినందున ఈ నెల  14, 15 తేదీల్లో చార్‌థామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపి వేసినట్టుగా  అధికారులు వివరించారు.చార్‌థామ్  యాత్ర  నాలుగు పుణ్యక్షేత్రాలను కలిగి ఉంటుంది. గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్  ఆలయాలను  దర్శించుకొనేందుకు చార్ థామ్  యాత్ర నిర్వహిస్తారు.చార్‌థామ్ యాత్ర కు  ఈ ఏడాది ఏప్రిల్  22న  అధికారులు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో  ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  జూన్, జూలై మాసాల్లో భారీ వర్షాలు కురిశాయి, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్,  ఢిల్లీ  తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి.   తాజాగా  ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో  కొండ చరియలు విరిగిపడుతున్నాయి.  దీంతో  చార్‌థామ్ యాత్రకు వస్తున్న భక్తులు  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్