చార్ ధామ్ యాత్ర 2023: కేదార్‌నాథ్-బద్రీనాథ్ వెళ్లే భక్తులకు హెచ్చ‌రిక‌లు.. !

By Mahesh RajamoniFirst Published Apr 27, 2023, 6:42 PM IST
Highlights

Char Dham Yatra 2023: ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్ర 2023 కు సంబంధించి అధికారులు ప‌లు హెచ్చ‌రిక‌లు చేశారు. ప్ర‌స్తుతం నెల‌కొన్న అక్క‌డి వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను గురించి ప్ర‌స్తావిస్తూ.. ప‌లు సూచ‌న‌లు చేశారు. కేదార్ నాథ్-బద్రీనాథ్ కు వెళ్లే భక్తులు ప్ర‌స్తుత వాతావరణం, వర్షం, హిమపాతం వంటి స‌వాళ్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని త‌మ యాత్రను కొన‌సాగించాల‌ని పేర్కొన్నారు. అలాగే.. 
 

Uttarakhand Char Dham Yatra 2023: చార్ ధామ్ యాత్ర 2023 కు సంబంధించి గురువారం (ఏప్రిల్ 27) ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ప్ర‌తికూల‌ వాతావరణంపై  కీల‌క ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఉత్తరాఖండ్ లో మరోసారి వాతావరణం ప్ర‌తికూలంగా మారింది. ఈ క్ర‌మంలోనే వాతావరణానికి సంబంధించి ఐఎండీ ఒక అంచనాను విడుదల చేసింది. అలాగే, ప‌లు హెచ్చరికలు చేసింది. కేదార్ నాథ్ -బద్రీనాథ్ సహా నాలుగు ధామ్ మార్గాల్లో గురువారం వాతావరణం ఒక్క‌సారిగా మారింది. అటువంటి పరిస్థితిలో, ఇప్పుడు గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ-ఎన్సీఆర్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ స‌హా దేశంలోని అనేక రాష్ట్రాల నుండి ఉత్తరాఖండ్ చార్ ధామ్ కు వెళ్లే యాత్రికులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

మారిన వాతావ‌ర‌ణం కార‌ణంగా వర్షం తర్వాత జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటం, బండరాళ్లు పడటంతో చార్ ధామ్ యాత్ర మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవ‌కాశ‌లు ఉన్నాయ‌ని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో హైవేను మూసివేస్తే చార్ ధామ్ యాత్ర మార్గంలో యాత్రికులు రాత్రంతా ఆకలితో, దాహంతో గడపాల్సి వస్తుంది.  కేదార్ నాథ్ ధామ్ లో వాతావరణం మరోసారి తీవ్ర మార్పుల‌కు గురైంది.  ధామ్, పరిసర ప్రాంతాల్లో హిమపాతం కొనసాగుతోంది. హిమపాతం కారణంగా కేదార్ పురిలో చలి తీవ్రంగా పెరిగింది.

వర్షం తర్వాత యమునోత్రి ధామ్ లో కూడా మంచు కురిసింది. రెండు ధామ్ లలో హిమపాతం తర్వాత యాత్రికుల సమస్యలు కూడా రెట్టింపయ్యాయ‌ని స‌మాచారం. బద్రీనాథ్, గంగోత్రి ధామ్ ల‌లో గురువారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. రాత్రంతా వర్షం ఇలాగే కొనసాగితే రెండు ధామ్ లలో మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరకాశీ జిల్లాలో వాతావరణం మరోసారి దిగజారింది. వాతావరణం అనుకూలించకపోవడంతో రెండు రోజులుగా లోతట్టు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. 

ఎత్తైన ప్రాంతాల్లో భారీ వర్షం, హిమపాతం కనిపించింది. గంగోత్రి ధామ్ లో భారీ వర్షం కురిసింది. యమునోత్రి ధామ్ వద్ద యాత్రికులు మంచును ఆస్వాదించారు. కానీ ఈ ప‌రిస్థితులు క్ర‌మంగా తీవ్ర రూపంతో ప్ర‌తికూలంగా మారే అవ‌కాశ‌ముందని స‌మాచారం. వాతావరణంలో మార్పుల కారణంగా లోతట్టు ప్రాంతాలు.. ఉత్తరకాశీ, పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిశాయి. గంగోత్రి ధామ్ సహా హర్షిల్, ముఖ్బా, ఝాలా తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు, కొన్ని చోట్ల ఉరుములు మెరుపుల‌తో వ‌ర్షాలు ప‌డ్డాయి. 

గంగోత్రి ధామ్ లో భారీ వర్షం కురిసింద‌నీ, దీంతో ధామ్ లోని యాత్రికులు తీవ్రమైన చలితో వణికిపోతూ కనిపించార‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో యమునోత్రి ధామ్ సహా ఎత్తైన ప్రాంతాల్లో హిమపాతం ప్రారంభమైంది. వాతావరణం అనుకూలిస్తే రాత్రి గంగోత్రి ధామ్ లో మంచు కురిసే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలాఖరులో వర్షాలు, హిమపాతం కారణంగా వాతావ‌ర‌ణం ప్ర‌తికూలంగా మారింది.  ఈ అంశం ఇప్పుడు సాధారణ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎందుకంటే  సాధారణంగా ఈ నెలలో చాలా వేడిగా ఉంటుంది.. కానీ ఈ సారి అలాంటి ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు.

click me!