చంద్రబిలాల ఫోటోలు పంపిన చంద్రయాన్-2

Published : Aug 26, 2019, 10:23 PM ISTUpdated : Aug 27, 2019, 07:06 AM IST
చంద్రబిలాల ఫోటోలు పంపిన చంద్రయాన్-2

సారాంశం

చంద్రయాన్-2  చంద్రుడిపై ఉన్న బిలాల చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. సోమవారం నాడు ట్విట్టర్ ద్వారా ఈ పోటోలను విడుదల చేసింది.


న్యూఢీల్లీ: ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 చంద్రునిపై అనేక విశేషాలను భూమికి చేరవేస్తోంది.  చంద్రయాన్-2 ఆర్బిటర్ కెమెరా చంద్రబిలాలను చిత్రీకరించింది. ఈ మేరకుఇస్రో ఈ విషయాన్ని ట్వీట్ చేసింది.

 

ఈ నెల 23వ తేదీన రాత్రి 7:42 గంటలకు ఆర్బిటర్ కెమెరా ద్వారా ఈ చిత్రాలను రికార్డు చేసింది. చంద్రునికి 4375 కి.మీ. ఎత్తు నుండి ఈ ఫోటోలను చిత్రీకరించారు. ఆర్బిటర్ టెర్రియన్ మ్యాపింగ్ కెమెరా-2 ఈ బిలాలను చిత్రీకరించినట్టుగా ఇస్రో ప్రకటించింది.

చంద్రుని ఉత్తరార్థ గోళంలోని జాక్సన్ మాక్, మిత్ర, కొరోలివే వంటి బిలాలా చాయా చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. చంద్రునిపై సౌర మచ్చల చిత్రాలను ఇస్రో విడుదల చేసింది.
 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం