మరో మైలురాయి: భూకక్ష్యను దాటిన చంద్రయాన్-2.. చంద్రునివైపు వడివడిగా

By Siva KodatiFirst Published Aug 14, 2019, 11:32 AM IST
Highlights

ప్రతిష్టాత్మక చంద్రయాన్-2 ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ (ఇస్రో) మరో మైలురాయిని దాటింది. చంద్రయాన్-2 వ్యోమనౌక భూ కక్ష్యను దాటి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. బుధవారం తెల్లవారుజామున 2.21 గంటల ప్రాంతంలో ఇస్రో శాస్త్రవేత్తలు కక్ష్యను పెంచే ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. 

ప్రతిష్టాత్మక చంద్రయాన్-2 ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ (ఇస్రో) మరో మైలురాయిని దాటింది. చంద్రయాన్-2 వ్యోమనౌక భూ కక్ష్యను దాటి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది.

బుధవారం తెల్లవారుజామున 2.21 గంటల ప్రాంతంలో ఇస్రో శాస్త్రవేత్తలు కక్ష్యను పెంచే ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. నౌకలోని ద్రవ ఇంజిన్‌ను 1,203 సెకన్లపాటు మండించి కక్ష్యను పెంచినట్లు ఇస్రో తెలిపింది.

ప్రస్తుతం ఇది జాబిల్లి కక్ష్యకు చేరే ట్రాన్స్ ల్యూనార్ మార్గం గుండా ప్రయాణిస్తోందని.. మరో ఆరు రోజుల తర్వాత ఆగస్టు 20న వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇప్పటి వరకు చంద్రయాన్-2 ఎలాంటి అవరోధం లేకుండా విజయవంతంగా ముందుకు దూసుకెళ్తోందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె. శివన్ తెలిపారు. వ్యోమనౌక సెప్టెంబర్ 7న చంద్రుడి ఉపరితలం దక్షిణ ధ్రువం సమీపంలో దిగనుందన్నారు.

బెంగళూరులోని ఇస్రో మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స నుంచి నిరంతరంగా చంద్రయాన్-2 గమనాన్ని పర్యవేక్షిస్తున్నామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గత నెల 22న శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్-2 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వ్యోమనౌకలో ఆర్బిటర్, ల్యాండర్, రోవ్ ఉన్నాయి. దీని మొత్తం బరువు 3,850 కిలోలు.

click me!