సీఈసీతో బాబు సహా 21 పార్టీల నేతల భేటీ

Published : May 07, 2019, 05:12 PM IST
సీఈసీతో బాబు సహా 21 పార్టీల నేతల భేటీ

సారాంశం

కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సహా 21 పార్టీల నేతలు మంగళవారం నాడు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.  


న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సహా 21 పార్టీల నేతలు మంగళవారం నాడు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

ఈవీఎంలలో వీవీప్యాట్ స్లిప్పులకు మధ్య వ్యత్యాసం వస్తే ఏం చేయాలనే దానిపై నిబంధనలను రూపొందించాలని ఎన్నికల సంఘం ప్రతినిధులతో చర్చిస్తున్నారు.
వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుకు సంబంధించి ఈ 21 పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. 

ఈ పార్టీల రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో వీవీప్యాట్ స్లిప్పులకు, ఈవీఎంలలోని లెక్కలకు మధ్య వ్యత్యాసం వస్తే ఏం చేస్తారని 21 పార్టీలు ఎన్నికల సంఘం ప్రతినిధులను ప్రశ్నించాయి.ఈ విషయమై నిబంధనలను రూపొందించాలని చంద్రబాబు సహా రాజకీయ పార్టీలు డిమాండ్ చేశారు.

PREV
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్