కుమారస్వామితో భేటీకి కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే రమేష్ జార్కి రెఢీ

By narsimha lodeFirst Published May 7, 2019, 4:23 PM IST
Highlights

కర్ణాటక సీఎం కుమారస్వామితో చర్చలకు కాంగ్రెస్ రెబెల్ నేత రమేష్ జార్కి హోళి  సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రితో రాజీకి మధ్యవర్తులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
 

బెంగుళూరు: కర్ణాటక సీఎం కుమారస్వామితో చర్చలకు కాంగ్రెస్ రెబెల్ నేత రమేష్ జార్కి హోళి  సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రితో రాజీకి మధ్యవర్తులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

ముఖ్యమంత్రితో రాజీకి మధ్యవర్తులతో రమేష్ జార్కి కొన్ని షరతులు పెట్టారు. జార్కి హోళితో రాయచూరు ఎంపీ బి.వి.నాయక్, ఆప్తుడు ఎన్‌.పి. బిరాదార్‌లు బెంగుళూరులోని ఓ కీలక ప్రాంతంలో చర్చించారని  సమాచారం.

కాంగ్రెస్  నుండి  నాలుగు దఫాలుగా విజయం సాధించిన జార్కి హోళి సూత్రప్రాయంగా అంగీకరించినట్టుగా సమాచారం.తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన ఉందని ఆయన చెప్పారు. మంత్రి పదవితో పాటు బెళగావి జిల్లా ఇంచార్జీ డికె శివకుమార్ జోక్యం ఉండకూడదని షరు పెట్టినట్టుగా సమాచారం.

ఇటీవలే పార్టీకి గుడ్‌బై చెబుతానని ఎమ్మెల్యే పదవి కి రాజీనామా చేస్తానని ప్రకటించిన రమేశ్‌ జార్కిహొళిలో అనూహ్య మార్పుల వె నుక భారీ కసరత్తు జరిగినట్లు తెలుస్తోం ది. ఇటీవల వారం రోజులుగా రమేశ్‌ జా ర్కిహొళి సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి విమర్శలు చేయలేదు. ఈ నేపథ్యంలోనే రాజీ చర్చలు జరిగినట్లు సమాచారం. 

గురువారం నుంచి కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలతో చర్చలకు ఆహ్వానించినా సీఎం ప్రధానంగా అసంతృప్తి ఎమ్మెల్యే కీలక నేతగా ఉన్న రమేశ్‌జార్కిహొళిని తనవైపు తిప్పుకోవాలని భావించారు. 

రెండు మూడు రోజులుగా బెంగళూరులోనే ఉన్న రమేశ్‌జార్కిహొళితో ప్రతినిధుల చర్చలు జరిపారు. ఇక ఏ క్షణంలోనైనా ఆయన సీఎంతో భేటీ కావచ్చునని తెలుస్తోంది. రమేశ్‌ జార్కిహొళితో ఏకంగా సర్కార్‌ కూలుతుందనే స్థాయికి చేరగా ప్రస్తుతం మార్పులు రావడంతో రమేశ్‌ జార్కిహొళి డిమాండ్లలో కొన్నింటికి వెనువెంటనే కుమారస్వామి పరిష్కరించే అవకాశం కూడా కనిపిస్తోంది.

click me!