డీఎంకే ఎమ్మెల్యే ఇంట్లో చదివింపుల విందు.. రూ.10 కోట్లు వసూలు.. !

By Bukka SumabalaFirst Published Aug 25, 2022, 12:19 PM IST
Highlights

చదివింపుల విందులో పదికోట్ల రూపాయలు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో ఓ డీఎంకే ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన విందులో ఇది జరిగింది. 

తమిళనాడు : చదివింపుల విందు.. కష్టాల్లో ఉండే బంధువులను, స్నేహితులను ఆదుకోవడానికి కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే విందు. దీనిమీద ఇటీవలి కాలంలో తెలుగులో ‘జయమ్మ పంచాయతీ’ అనే సినిమా కూడా వచ్చింది. అయితే ఈ విందులో మామూలుగా వేలు, లక్షల రూపాయలు రావడం మామూలే. కానీ తమిళనాడులో ఓ చదివింపుల విందులో ఏకంగా రూ.10 కోట్లు వచ్చాయి. ఇప్పుడిది చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెడితే.. 

తమిళనాడులో ఓ డీఎంకే ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన వేడుకలో రూ. 10కోట్ల విలువైన చదివింపులు వచ్చాయి.  తంజావూరు, పుదుకోట్టై తదితర జిల్లాల్లో చదివింపులు విందువేడుక వందేళ్లుగా నిర్వహిస్తున్నారు. తమ తమ ఆర్థిక స్తోమతను బట్టి విందు ఏర్పాటు చేస్తుంటారు. విందుకు వచ్చినవారు చదివించిన నగదుతో వారి.. జీవితన పరిస్థితులను.. ఆర్థిక స్థితిని మెరుగు పరుచుకుంటారు. సాయంకోసం ఎవరి దగ్గర చేయి చాచకుండా కష్టంలో ఉండే బంధువులకు చేయూతనిచ్చేందుకు ఈ ఆచారాన్ని ప్రారంభించారు.

మోదీ పర్యటనలో భద్రతా లోపం: ఎస్‌ఎస్‌పీ విధుల నిర్వహణలో విఫలం.. కమిటీ రిపోర్టును వెల్లడించి సుప్రీం కోర్టు

అయితే, ఈ విందు పదే పదే చేయడానికి వీల్లేదు. ఒకసారి చదివింపుల విందు నిర్వహిస్తే మళ్ళీ ఐదేళ్ల తర్వాతే ఏర్పాటు చేయాలన్న నిబంధన కూడా ఉంది. ఈ నేపథ్యంలో పేరావూరణి నియోజకవర్గ ఎమ్మెల్యే అశోక్ కుమార్ తన మనవడి చెవులు కుట్టే వేడుక, చదివింపులు విందు ఒకేసారి నిర్వహించారు. ఈ వేడుకలో మాంసాహారులకు, శాఖాహారులకు ప్రత్యేక విందు విడివిడిగా ఏర్పాటు చేశారు. చదివింపులు సమర్పించే వారికోసం 40 కౌంటర్లు ఏర్పాటు చేసి వసూలు చేశారు. ఈ విందులో రూ. 10 కోట్ల వరకు వసూలు కావడం గమనార్హం. 
 

click me!