ఉపయోగం లేని పురాతన చట్టాల రద్దు: కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు 

By Rajesh KarampooriFirst Published Oct 23, 2022, 12:37 AM IST
Highlights

అంతగా ఉపయోగం లేని పాత చట్టాలను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. ఇప్పటికే 1500 చట్టాలను తొలగించామని తెలిపారు.  
 

కొన్ని పురాతన చట్టాలు సామాన్యుల జీవితాల్లో అడ్డంకులు సృష్టిస్తున్నాయని, అందుకే ప్రజలపై భారం తగ్గించేందుకు ఇలాంటి పలు పురాతన చట్టాలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు శనివారం అన్నారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‭లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ..
ఈ వ్యాఖ్యలు చేశారు.

కొన్ని పాత చట్టాలు సామాన్య ప్రజల సాధారణ జీవితానికి ఆటంకాలుగా మారాయనీ, ఆ చట్టాలు రోజురోజుకు వారికి భారంగా మారాయి. సామాన్య ప్రజలు శాంతియుతంగా జీవించేందుకు ఈ చట్టాలను తొలగించి.. ప్రజలకు ప్రశాంత జీవనం అందించాలని ప్రధాని మోదీ  కోరుకుంటున్నారని ఆయన చెప్పారు  

"చాలా కాలం క్రితం అమలులో ఉన్న.. వాడుకలో లేని, పురాతన చట్టాలను తొలగించాలని మేము నిర్ణయించుకున్నాము.  నేటి కాలంలో ఎటువంటి ఔచిత్యం లేదు, అనవసరమైన చట్టాలు సామాన్యులకు భారం, వాటిని తగ్గించాలి. మేము ఇప్పటికే 1500 చట్టాలను తొలగించాము, ”అని కేంద్ర మంత్రి అన్నారు.

 

Shillong, Meghalaya | Some old laws work as impediments to normal life of common people & we've to reduce compliance burden on people. PM Modi desires that common people should live peacefully & there should be minimum presence of govt in their lives: Union Law Min Kiren Rijiju pic.twitter.com/hrhkAoAj26

— ANI (@ANI)
click me!