కేసీఆర్ ధర్నాపై స్పందించిన కేంద్రం.. బాయిల్డ్ రైస్ కొనే ప్రసక్తే లేదు.. ధాన్యం సేకరణ వివరాలు వెల్లడి..

By team telugu  |  First Published Nov 18, 2021, 3:36 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ధర్నాపై కేంద్ర ప్రభుత్వం (Central Government) స్పందించిది. ధాన్యం సేకరణపై కేంద్ర ప్రబుత్వం వర్గాలు వివరాలు వెల్లడించాయి. బాయిల్డ్ రైస్‌ను (boiled rice) కొనే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి. 


వరి కొనుగోళ్లపై (paddy procurement) కేంద్రం ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఇందిరా పార్క్ వద్ద (Indira park)  టీఆర్‌ఎస్ మహాధర్నా (TRS Maha Darna) చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో టీఆర్‌ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా పాల్గొన్నారు. ధాన్యం కొంటారా..? కొనరా..? అంటూ సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం రాష్ట్ర గవర్నర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్ చేపట్టిన ధర్నాపై కేంద్ర ప్రభుత్వం (Central Government) స్పందించిది. ధాన్యం సేకరణపై కేంద్ర ప్రబుత్వం వర్గాలు వివరాలు వెల్లడించాయి. బాయిల్డ్ రైస్‌ను (boiled rice) కొనే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి. 

గత ఖరీఫ్‌లో 32 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కొన్నామని కేంద్రం వెల్లడించింది. ఈ ఖరీఫ్‌లో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు అంశం పరిశీలనలో ఉందని చెప్పింది. గత రబీ సీజన్‌లో ఇచ్చిన హామీతో సహా మొత్తం వరి ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం చేసింది. రబీలో ఎంత ధాన్యం కొనుగోలు చేసేది త్వరలో స్పష్టం చేస్తామని తెలిపింది. గత నిర్ణయాల ప్రకారం ఇప్పటివరకు బాయిల్డ్ రైస్ సేకరించామని.. బాయిల్డ్ రైస్‌ను కొనే ప్రసక్తే లేదని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ  స్పష్టం చేసింది. బాయిల్డ్ రైస్ తినే రాష్ట్రాలు సొంతంగా సేకరణ చేస్తున్నాయని తెలిపింది. జాతీయ ప్రయోజనాల రీత్యా పంట వైవిధ్యం అవసరమని పేర్కొంది. దేశంలో వరి పంట సాగు ఎక్కువైందని.. ధాన్యం నిల్వలు పెరిగిపోయాని చెప్పింది.

Latest Videos

undefined

Alos read: KCR: అవసరమనుకుంటే భారత రైతాంగ సమస్యలపై టీఆర్‌ఎస్ లీడర్ షిప్ తీసుకుంటుంది.. కేంద్రంపై కేసీఆర్ ఫైర్

దేశంలో పప్పు ధాన్యాల కొరత పెరగడంతో.. దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. దేశ వ్యాప్తంగా వరి, గోధుమ పంటను తక్కువగా పండించాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు సూచించాయి. నూనె, పప్పు ధాన్యాల పంటలు ఎక్కువగా పండించాలని తెలిపాయి. అన్ని రాష్ట్రాలు ఇదే సూచన చేస్తున్నట్టుగా వెల్లడించాయి.

click me!