సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ ఐటమ్‌లపై కేంద్రం నిషేధం

By telugu teamFirst Published Aug 13, 2021, 7:43 PM IST
Highlights

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించనుంది. వచ్చే ఏడాది జులై 1 నుంచి ఈ బ్యాన్ అమల్లోకి రానుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గ్లాసులు, కప్‌లు, ప్లేట్లు, స్ట్రాలు, ట్రేలు సహా ఇతర ఐటమ్స్‌పై నిషేధం అమల్లోకి రానుంది. వచ్చే ఏడాది చివరి నాటికి పాలిథీన్ బ్యాగ్‌ల మందాన్ని 120 మైక్రాన్‌లకు పెంచనుంది.

న్యూఢిల్లీ: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగ రహిత దేశంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ కప్‌లు, గ్లాసులు, ప్లేట్స్, స్ట్రాలు సహా ఇతర సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, విక్రయం, వినియోగంపై బ్యాన్ విధించింది. ఈ బ్యాన్  వచ్చే ఏడాది జులై 1 నుంచి అమల్లోకి రానున్నట్టు తాజాగా ఓ నోటిఫికేషన్‌లో వెల్లడించింది.

పాలిథీన్ బ్యాగ్‌లపైనా ఆంక్షలు
వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువలపై నిషేధంతోపాటు పాలిథీన్ బ్యాగ్‌ల మందాన్ని పెంచే నిర్ణయాలు తీసుకుంది. వచ్చయే ఏడాది డిసెంబర్ 31 నాటికి పాలిథీన్ బ్యాగ్‌ల మందాన్ని 120 మైక్రాన్‌లకు పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని రెండు విడతల్లో అమలు చేయనుంది. ప్రస్తుతం 50 మైక్రాన్‌ల బ్యాగ్‌లు వినియోగంలో ఉన్నాయి. దీన్ని సెప్టెంబర్ 30 నాటికి 75 మైక్రాన్‌లకు పెంచనుంది. సెప్టెంబర్ 30 తర్వాత 75 మైక్రాన్‌లకు తక్కువున్న బ్యాగ్‌ల తయారీ, విక్రయం, వినియోగంపై నిషేధం అమలవుతుంది. డిసెంబర్ 31 తర్వాత ఇదే తరహాలో 120 మైక్రాన్‌ల కంటే మందంగా ఉన్న పాలిథీన్ బ్యాగ్‌లకే అనుమతి ఉండనుంది. ఇతర కంపోస్టేబుల్ ప్లాస్టిక్‌తో తయారుచేసే బ్యాగ్‌లకు నిషేధం నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే, ఆయా తయారీదారులు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

click me!