రాష్ట్రాల అప్పుల వివరాలను వెల్లడించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉందంటే..

Published : Jul 25, 2022, 04:34 PM ISTUpdated : Jul 25, 2022, 05:11 PM IST
రాష్ట్రాల అప్పుల వివరాలను వెల్లడించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉందంటే..

సారాంశం

భారతదేశంలో రాష్ట్రాల అప్పుల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వివరాలు వెల్లడించారు.

భారతదేశంలో రాష్ట్రాల అప్పుల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. మూడేళ్లలో రాష్ట్రాలు తీసుకున్న అప్పుల జాబితాను విడుదల చేశారు. ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ 2021-22 పేరుతో నివేదిక తయారు చేశామని చెప్పింది. ఆ జాబితాను పరిశీలిస్తే.. 2022 మార్చి వరకు ఏపీ అప్పులు రూ. 3 లక్షల 98 వేల కోట్లుగా ఉన్నాయి. 2022 మార్చి వరకు తెలంగాణ అప్పులు రూ. 3 లక్షల 12 వేల కోట్లుగా ఉన్నాయి. 

అయితే తెలంగాణ అప్పులపై స్పందించిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అప్పులు చేసిన తెలంగాణ అభివృద్ది చెందలేదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీలో అప్పులపై అనేక సార్లు ప్రస్తావించామని చెప్పారు. తమని పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ ఎడాపెడా అప్పులు చేశారని విమర్శించారు.  

2014లో తెలంగాణ అప్పు రూ. 69వేల కోట్లుగా ఉందన్నారు. 2022లో తెలంగాణ అప్పు రూ. 3.12 లక్షల కోట్లకు చేరిందన్నారు. పెద రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌తో సమానంగా అప్పులు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అంకెలు తారుమారు చేసి చూపిస్తోందని కాగ్ చెబుతుందని తెలిపారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఇష్టానుసారం అప్పులు చేయడం దేశానికి మంచిది కాదని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Recharge Price Hike : న్యూఇయర్ లో మీ ఫోన్ మెయింటెనెన్స్ మరింత కాస్ట్లీ.. మొబైల్ రీచార్జ్ ధరలు పెంపు..?
Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు