SP leader Azam Khan:  సుప్రీంకోర్టులో SP అధినేత ఆజం ఖాన్‌కు ఎదురుదెబ్బ‌..  'ఆ కేసులో జోక్యం చేసుకోలేం' 

Published : Jul 25, 2022, 04:07 PM IST
SP leader Azam Khan:  సుప్రీంకోర్టులో SP అధినేత ఆజం ఖాన్‌కు ఎదురుదెబ్బ‌..  'ఆ కేసులో జోక్యం చేసుకోలేం' 

సారాంశం

SP leader Azam Khan: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ఆజం ఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజంఖాన్ నకిలీ జనన ధృవీకరణ పత్రం కేసులో విచారణను రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్‌పై విచారణకు కారణం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. 

SP leader Azam Khan: సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) అధినేత ఆజం ఖాన్‌కు సుప్రీంకోర్టు(supreme court)  నుంచి ఎదురుదెబ్బ తగిలింది. నకిలీ జనన ధృవీకరణ ప‌త్రాల కేసులో విచారణను రద్దు చేయాలంటూ  సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నాయకుడు అబ్దుల్లా ఆజంఖాన్ (Abdulla Azam Khan) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు కోర్టు నిరాకరించింది. 

అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను సమాజ్‌వాదీ పార్టీ నేత తన పిటిషన్‌లో సవాలు చేశారు. ఆజంఖాన్‌ పిటిషన్‌ను తిరస్కరించిన న్యాయస్థానం.. ఈ పిటిషన్‌ను విచారించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అందుకే ఈ పిటిషన్‌ను కొట్టివేసిన‌ట్టు తెలిపింది. ట్రయల్ కోర్టులో సాక్ష్యాధారాల ఆధారంగా విచారణ సాగాలని సుప్రీంకోర్టు పేర్కొంది.

హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదని జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ విక్రమ్ నాథ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ట్రయల్ కోర్టులో సాక్ష్యాధారాల ఆధారంగా విచారణ కొనసాగించాలని కూడా కోర్టు(supreme court) పేర్కొంది. 

ఆజం కుమారుడికి రెండు వేర్వేరు ప్రాంతాల నుంచి రెండు నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లక్నో,  రాంపూర్ నుండి కుమారుడికి రెండు నకిలీ జనన ధృవీకరణ పత్రాలను పొందడానికి అజం ఖాన్, అతని భార్య టాంజిన్ ఫాతిమా సహాయం చేశారని ఆరోపిస్తూ రాంపూర్ బిజెపి నాయకుడు ఆకాష్ సక్సేనా 2019 లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆజం ఖాన్, అతని భార్య తాజిన్ ఫాతిమా, కుమారుడు అబ్దుల్లా ఆజం ఖాన్‌లపై క్రిమినల్ కేసు నమోదు చేసి జైలుకు పంపారు.

విచారణ సందర్భంగా.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ విక్రమ్ నాథ్‌లతో కూడిన ధర్మాసనం మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చిందని, కాబట్టి.. ఫేక్ స‌ర్టిఫికేట్ వచ్చి ఉంద‌నీ, అన్నారు. ఇందులో ఆ స‌ర్టిఫికేట్ జారీ చేసిన‌ అధికారి కూడా దోషే. 468, 420 కింద అభియోగాలు మోపామని, హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్