కోవిడ్-19 కు ఆయుర్వేద మందు ను కనిపెట్టినట్లు ప్రముఖ దేశీయ కంపెనీ పతంజలి ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ మందు కు సంబంధించి కీలక ప్రకటన చేసింది.
కోవిడ్-19 కు ఆయుర్వేద మందు ను కనిపెట్టినట్లు ప్రముఖ దేశీయ కంపెనీ పతంజలి ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ మందు కు సంబంధించి కీలక ప్రకటన చేసింది.
కోవిడ్-19 ను నయం చేసే మందుగా పతంజలి చెప్పుకొస్తున్న ఈ మందు కు సంబంధించి ఎలాంటి ప్రకటనలు జారీ చేయొద్దని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సదరు సంస్థ ను ఆదేశించింది.
Also Read:ఢిల్లీ తెలంగాణ భవన్‌లో ఒకరికి కరోనా: చికిత్సకు తరలింపు
కరోనాకు సంబంధించి పతంజలి చెబుతున్న దాని గురించి తమకు సమాచారం లేదని, దానికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ కానీ, మెడిసిన్ శాస్త్రీయత గురించి, మెడిసిన్ శాస్త్రీయత గురించి కానీ ఇప్పుడే నిర్థారించలేమని ఆయుష్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది.
ఈ మందు పై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆయుష్ మంత్రిత్వ శాఖ అభిప్రాయ పడింది. 1954, డ్రగ్స్ నియంత్రణ చట్టం ప్రకారం పతంజలి ఈ మందు కు సంబంధించి ప్రకటనలు జారీ చేయడం అభ్యంతరకరమని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఈ మందు కు సంబంధించిన అన్ని వివరాలను.. ఎక్కడ పరిశోధనాత్మక అధ్యయనం చేశారో, ఈ మందు వేటి తో తయారైందో, శాంపిల్ పరిమాణం తో సహా అన్ని వివరాలను వెల్లడించాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ పతంజలి సంస్థ కు ఆదేశాలు జారీ చేసింది.
Also Read:కరోనాకి మందు కనిపెట్టిన బాబా రాందేవ్
ఇదిలా ఉంటే.. పతంజలి తయారు చేసిన కొరోనిల్ వాడితే రెండు వారాల్లో కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకుంటారని రాందేవ్ బాబా చెప్పుకొచ్చారు. 150 కి పైగా ఔషధ మొక్కలను ఈ మందు ను తయారు చేసేందుకు వాడినట్లు పతంజలి సంస్థ ప్రకటించింది.
ఈ కరోనా కిట్ ధర ను 545 రూపాయలుగా నిర్ణయించినట్లు పతంజలి సీఈవో ఆచార్య బాలక్రిష్ణ ప్రకటించిన సంగతి తెలిసిందే. పతంజలి స్టోర్ట్స్ లో మాత్రమే ఈ మందు దొరుకుతుందని సంస్థ ప్రకటించింది.