
ప్రస్తుతం శ్రీలంకలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభంపై కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం దారి తప్పింది. శ్రీలంక ప్రస్తావన తెస్తూ ఏపీ, తెలంగాణ అప్పులపై కేంద్రం మాట్లాడింది. శ్రీలంకలో పరిస్ధితికి రాజకీయాలు, అపరిమిత అప్పులే కారణమని కేంద్ర ప్రభుత్వం ప్రజంటేషన్ ఇచ్చింది. అయితే కేంద్రం వివరణను టీఆర్ఎస్ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇందులో రాజకీయ దురుద్దేశం వుందని మండిపడ్డారు.
ఇకపోతే.. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. ప్రజా ఆందోళనలు హోరెత్తుతున్నాయి. శ్రీలంక అధ్యక్ష పదవికీ గొటబయ రాజపక్సే రాజీనామా చేయడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రభుత్వ పదవుల నుంచి వైదొలగారు. అయినప్పటికీ శ్రీలంకలో నిరసనలు ఆగడం లేదు. దేశంలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం మధ్య, తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే పదవిని చేపట్టారు. అయితే, ప్రస్తుతం ఆయన రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ మంగళవారం కొలంబోలో నిరసనలు చెలరేగాయి. నిరసనకారులు రణిల్ విక్రమసింఘేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Also REad:Sri Lanka: శ్రీలంక సంక్షోభం.. రణిల్ విక్రమసింఘే రాజీనామా చేయాలంటూ నిరసనలు
శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, శ్రీలంక పోడుజన పెరామునా (ఎస్ఎల్పీపీ) పార్లమెంటేరియన్ దుల్లాస్ అలహపెరుమా, నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) నేత అనురా కుమార దిసానాయకేలను మంగళవారం పార్లమెంట్ అధ్యక్ష పదవికి నామినేట్ చేశారు. బుధవారం ఉదయం పార్లమెంటు సభ్యులు సమావేశమై శ్రీలంకకు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ముందుగా రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలనే కోరికను వ్యక్తం చేసిన ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస తన రాష్ట్రపతి నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు మంగళవారం నాడు ప్రకటించారు.శ్రీలంక తదుపరి అధ్యక్షుడికి జరిగే ఓటింగ్ లో తమ పార్టీ సమాగి జన బాలవేగయ (ఎస్ జేబీ) అలహపెరుమాకు మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు.