కేంద్రం సంచలన నిర్ణయం: జూలై 31 వరకు లాక్‌డౌన్ పొడిగింపు, అన్‌లాక్-2 మార్గదర్శకాలివే

By Siva Kodati  |  First Published Jun 29, 2020, 10:51 PM IST

దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. కంటైన్‌మెంట్ జోన్లలో జూలై 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించింది


దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. కంటైన్‌మెంట్ జోన్లలో జూలై 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించింది. ఈ మేరకు సోమవారం రాత్రి అన్‌లాక్- 2 విధి విధానాలను ప్రకటించింది.

కేంద్ర, రాష్ట్ర శిక్షణా సంస్థలకు జూలై 15 నుంచి కార్యకలాపాలకు అవకాశం కల్పించింది. అలాగే హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకే అంతర్జాతీయ ప్రయాణికులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది.

Latest Videos

మెట్రో రైళ్లు, థియేటర్లు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌పై యథావిధిగా నిషేధం కొనసాగుతుందని వెల్లడించిందది. అలాగే సామాజిక, రాజకీయ, మతపరమైన కార్యకలాపాలపైనా నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. బుధవారం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. 

గత 24 గంటల్లో దేశంలో తకరోనా కేసులు 19 వేలకు పైగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ 19 కేసులు 5.48 లక్షలకు చేరుకొన్నాయి. దేశంలో వరుసగా ఆరో రోజు కరోనా కేసులు 15 వేలకు పైగా నమోదైనట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

దేశంలో కరోనా కేసుల సంఖ్య 5,48,318కి చేరుకొన్నాయి. వీటిలో 2,10,120 యాక్టివ్ కేసులు.కరోనా సోకిన 3,21,723 మంది రోగులు ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. అయితే గత 24 గంటల్లో 19,459 కొత్త కేసులు నమోదైనప్పటికీ ఒక్కరు కూడ మరణించలేదని కేంద్రం ప్రకటించింది

click me!