మంత్రి రాసలీలల కేసు... మరో వీడియో విడుదల

Published : Mar 27, 2021, 09:14 AM ISTUpdated : Mar 27, 2021, 09:23 AM IST
మంత్రి రాసలీలల కేసు... మరో వీడియో విడుదల

సారాంశం

తానుఅజ్ఞాతం లో ఉన్నానని, న్యాయవాది ద్వారా కమిషనర్‌కు ఫి ర్యాదులేఖను పంపుతున్నానని ఆమె వీడియో సందేశంలో పేర్కొన్నారు

కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి రాసలీలల సీడీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయనపై కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో కీలకంగా ఉన్న సదరు యువతి.. తాజాగా మరో వీడియోని విడుదల చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.

తానుఅజ్ఞాతం లో ఉన్నానని, న్యాయవాది ద్వారా కమిషనర్‌కు ఫి ర్యాదులేఖను పంపుతున్నానని ఆమె వీడియో సందేశంలో పేర్కొన్నారు. అడ్వొకేట్‌ కేఎన్‌ జగదీశ్‌కుమార్‌ మధ్యాహ్నం నగర పోలీసు కమిషనర్‌ కమల్‌పంత్‌కు యువతి ఫిర్యాదు లేఖ అందించారు. ఆ వెంటనే రమేశ్‌ జార్కిహొళిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.  తాజా పరిణా మాలపై బీజేపీ ఘాటుగా స్పందిం చింది. ఆ తర్వాత కాసేపటికే యువతి పేరిట విడు దలైన ఆడియోలో కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివ కు మార్‌ పేరు ప్రస్తావించటం కలకలం రేపుతోంది. 

కాగా, ‘సమస్య వచ్చింది. ఎదుర్కొంటా, భయపడను అసలు ఆట ఇప్పుడే మొదలైంది.. రేపటి నుంచే నా అస్త్రాలు వదులుతా’ అని రమేష్‌ జార్కిహొళి సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చిన తర్వాత తమపై కుట్ర మొదలైందన్నారు. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం