హాస్టల్ వార్డెన్ వేధింపులు.. తమిళనాడు బాలిక ఆత్మహత్య.. సీబీఐ విచారణకు ఆదేశించిన మద్రాస్ కోర్టు...

Published : Jan 31, 2022, 02:14 PM IST
హాస్టల్ వార్డెన్ వేధింపులు.. తమిళనాడు బాలిక ఆత్మహత్య.. సీబీఐ విచారణకు ఆదేశించిన మద్రాస్ కోర్టు...

సారాంశం

ఈ కేసులో బాలిక మృతికి కారణమైన హాస్టల్ వార్డెన్‌ను  గత వారం అరెస్టు చేశారు. ఈ ఘటనలో  గత వారం బయటపడిన ఒక వీడియోలో, బాలిక తనను వార్డెన్ అనేక పనులకు ఉపయోగిస్తున్నాడని వాపోయింది. గదులను శుభ్రం చేయడం, హాస్టల్ అకౌంట్స్ చూడడం లాంటి అనేక ఇతర పనులు చేయమని బలవంతం చేస్తున్నారని.. దీని వల్ల తాను సరిగ్గా చదువుకోలేకపోతున్నానని ఆ బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. 

చెన్నై : hostel warden వేధింపుల కారణంగా తమిళనాడులో 17 ఏళ్ల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై CBI Probe జరపాలని Madras High Court సోమవారం ఆదేశించింది. 12వ తరగతి చదువుతున్న minor girl జనవరి 9న తంజావూరులోని తన ఇంట్లో విషం తాగి suicide attempt చేసింది. ఇది గమనించి ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స తీసుకుంటూ కొద్ది రోజులకు మృతి చెందింది.

ఈ కేసులో బాలిక మృతికి కారణమైన హాస్టల్ వార్డెన్‌ను  గత వారం అరెస్టు చేశారు. ఈ ఘటనలో  గత వారం బయటపడిన ఒక వీడియోలో, బాలిక తనను వార్డెన్ అనేక పనులకు ఉపయోగిస్తున్నాడని వాపోయింది. గదులను శుభ్రం చేయడం, హాస్టల్ అకౌంట్స్ చూడడం లాంటి అనేక ఇతర పనులు చేయమని బలవంతం చేస్తున్నారని.. దీని వల్ల తాను సరిగ్గా చదువుకోలేకపోతున్నానని ఆ బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పనుల వల్ల చదువుకునే టైం లేక.. తన గ్రేడ్‌లు పడిపోతాయని ఆమె భయపడింది.

అందుకే "నేను చదువుపై దృష్టి సారించలేకపోయాను. మార్కులు తగ్గుతాయనే కారణంతో విషం తీసుకున్నాను" అని బాలిక చెప్పినట్టు ఈ unverified video ఉంది. అంతేకాదు "నేను అకౌంట్స్ చూసుకోవాలి, అన్ని పనులు చేయాల్సి వచ్చింది" అని ఆమె చెప్పింది.

ఆమె చనిపోయిన తరువాత వెలుగులోకి వచ్చిన మరో వీడియోలో తనను మతం మారమని అడిగితే...తల్లిదండ్రులు క్రైస్తవ మతంలోకి మారడానికి నిరాకరించినందున తనను వేధించారని, abuse చేశారని చెప్పింది. ‘రెండేళ్ల క్రితం నన్ను, నా తల్లిదండ్రులను క్రైస్తవ మతంలోకి మార్చమని అడిగారు..  అలా మారితే నా చదువు విషయంలో అయ్యే ఖర్చు మొత్తం తాము చూసుకుంటామని చెప్పారు’ అని బాలిక వీడియోలో పేర్కొంది. మతం మారనందుకు ఆమెను లక్ష్యంగా చేసుకున్నారా అనే ప్రశ్నకు, ఆ వీడియో ఆ అమ్మాయి "కావచ్చు" అని చెప్పింది.

మొబైల్ ఫోన్‌లో షూట్ చేసిన ఈ వీడియోలను ఇప్పుడు ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. అయితే వీటిని మొబైల్ ఫోన్ లో రికార్డు చేసిన వ్యక్తిని వేధించవద్దని, విచారణపై దృష్టి సారించాలని కోర్టు పోలీసులను ఆదేశిస్తూ.. ఈ వీడియోలను వారికి అందజేసింది. అయితే.. 

బాలిక గానీ, ఆమె తల్లిదండ్రులు గానీ.. ఇంతకు ముందు పోలీసులకు లేదా మేజిస్ట్రేట్‌కు లేదా బాలిక మరణ వాంగ్మూలంలో ఎక్కడ కూడా.. మతం మారమని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు చేయలేదని పోలీసులు చెబుతున్నారు. కాగా.. ఆమె తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని నమోదు చేయాలని కోర్టు మెజిస్ట్రేట్‌ను ఆదేశించింది. బలవంతపు మతమార్పిడులకు ఉదాహరణగా బీజేపీ తమిళనాడు విభాగం ఈ కేసును స్వీకరించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?