నీరవ్ లండన్‌లో లేడు.. ఎక్కడ ఉన్నాడో తెలియదు

First Published 11, Jun 2018, 7:21 PM IST
Highlights

నీరవ్ లండన్‌లో లేడు.. ఎక్కడ ఉన్నాడో తెలియదు

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.14 వేల కోట్లు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ లండన్‌లో ఉన్నాడని.. అక్కడే ఆశ్రయం పొందేందుకు పావులు కదుపుతున్నాడని మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై భారత అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ స్పందించింది. నీరవ్ మోడీ లండన్‌లో లేడని.. అతడు ఎక్కడున్నాడో తెలిస్తే.. తక్షణం చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. బ్రిటన్ ప్రభుత్వం నుంచి కూడా ఇందుకు సంబంధించి ఎలాంటి ధ్రువీకరణ లేదని సీబీఐ స్పష్టం చేసింది. మరోవైపు నీరవ్ మోడీ, అతడి మామ మెహుల్ చోక్సీలపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని సీబీఐ ఇంటర్‌పోల్‌కు విజ్ఞప్తి చేసింది. పీఎన్‌బీ కుంభకోణంలో నీరవ్, చోక్సీలతో కలిపి మొత్తం 25 మందిపై గత నెలలో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
 

Last Updated 11, Jun 2018, 7:21 PM IST