మాజీ సీఎం ఇంట్లో సీబీఐ దాడులు

By ramya neerukondaFirst Published Jan 25, 2019, 12:03 PM IST
Highlights

భూ కేటాయింపుల కుంభకోణానికి సంబంధించి హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా నివాసంలో శుక్రవారం సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. 

భూ కేటాయింపుల కుంభకోణానికి సంబంధించి హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా నివాసంలో శుక్రవారం సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. దాదాపు 30 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు దాడులు చేపట్టారు. 2005లో హర్యానాలోని పంచ్ కులలో ఏజేఎల్ కు ప్లాట్ ను రీ అలాట్ చేయడంపై గత ఏడాది డిసెంబర్ లో హుడా సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.

హుడా హర్యానా సీఎంగా పనిచేసిన సమయంలో పంచ్‌కులలో 14 పారిశ్రామిక ప్లాట్‌లను నామమాత్రపు ధరకు కట్టబెట్టారని ఆయనపై దర్యాప్తు ఏజెన్సీ ఆరోపిస్తోంది. ఇండస్ర్టియల్‌ ప్లాట్‌ల కేటాయింపునకు చివరి తేదీ 2012 జనవరి 6 కాగా, జనవరి 24న దరఖాస్తు చేసుకున్న 14 మందికి భూమిని కేటాయించారని ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది.

 ప్రత్యేక న్యాయస్ధానంలో చార్జిషీట్‌ దాఖలు చేసిన సీబీఐ పంచ్‌కులలో సీ-17 ప్లాట్‌ను రీ అలాట్‌ చేయడంతో ప్రభుత్వ ఖజానాకు రూ 67 లక్షల నష్టం వాటిల్లందని ఆరోపించింది.
 

click me!