ఢిల్లీ లిక్కర్ స్కాం: సప్లిమెంటరీ చార్జీషీట్ లో హైద్రాబాద్ వ్యక్తి పేరు

By narsimha lode  |  First Published Jul 13, 2023, 6:54 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  సప్లిమెంటరీ చార్జీషీట్ ను  గురువారంనాడు సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు.


న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంపై  సప్లిమెంటరీ చార్జీషీట్ ను  గురువారంనాడు సీబీఐ అధికారులు  కోర్టుకు సమర్పించారు. సప్లిమెంటరీ చార్జీషీట్ లో  నలుగురిపై  సీబీఐ అధికారులు అభియోగాలు మోపారు.  

హవాలా ద్వారా  రూ. 44 కోట్లు మళ్లించినట్టుగా సీబీఐ అధికారులు  చార్జీషీట్ లో  అభియోగం మోపారు. హైద్రాబాద్ కు చెందిన  ఓ ఇంగ్లీష్  మీడియా సంస్థకు  చెందిన  సింగ్ పై కూడ  సీబీఐ అధికారులు చార్జీషీట్ లో అభియోగాలు మోపారు. చారియేట్ ప్రొడక్షన్ మీడియా డైరెక్టర్ రాజేష్ జోషీ పేరును కూడ చార్జీషీట్ లో  సీబీఐ ప్రస్తావించింది.  హవాలా మార్గంలో  రూ. 44 కోట్లను గోవాకు తరలించారని సప్లిమెంటరీ చార్జీషీట్ లో  సీబీఐ అధికారులు ఆరోపించారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. 

Latest Videos

ఢిల్లీ లిక్కర్ స్కాం  దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  రాష్ట్రాల్లో  ఈడీ, సీబీఐ అధికారులు పలు దఫాలు సోదాలు నిర్వహించారు.ఈ రెండు రాష్ట్రాలకు చెందిన పలువురిని సీబీఐ, ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ, ఈడీ అధికారులు ప్రశ్నించారు.  కవితపై బీజేపీ నేతలు  పలు  ఆరోపణలు కూడ చేసిన విషయం తెలిసిందే. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టయ్యారు.  ఈ కేసులో ఆయన తీహార్ జైలులో ఉన్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో  మనీష్ సిసోడియాను  సీబీఐ అధికారులు అరెస్ట్  చేశారు.   ఇదే కేసులో ఈడీ అధికారులు మనీష్ సిసోడియాను  ఈ ఏడాది మార్చి  మాసంలో  అరెస్ట్  చేసిన విషయం తెలిసిందే.

click me!