ఇండోర్‌లోని ఎల్ఐజీ ఇంటర్సెక్షన్ సమీపంలోని ఓ ఫుడ్ స్టాల్ ఎదుట మద్యం మత్తులో బాలికలు వీరంగం సృష్టించారు. అర్ధరాత్రి నలుగురు అమ్మాయిలు ఓ అమ్మాయిని దారుణంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఘటనపై కేసు నమోదు కావడంతో పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నలుగురు బాలికలు అర్ధరాత్రి వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ఓ యువతిని నలుగురు యువతులు ఒంటరి దాన్ని చేసి.. నడిరోడ్డుపై తోసివేసి అత్యంత దారుణంగా కొట్టారు. విచక్షణరహితంగా పిడిగుద్దుల వర్షం కురిపించారు. మొబైల్ కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఇండోర్‌లోని ఎల్ఐజీ ఇంటర్సెక్షన్ సమీపంలోని ఓ ఫుడ్ స్టాల్ ఎదుట నవంబర్ 4 రాత్రి జరిగినట్టు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తుషార్ శ్రీవాస్తవ అనే వ్యక్తి తన ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ యువతిపై మద్యం మత్తులో ఉన్న నలుగురు యువతులు దాడి చేశారు. విచక్షణ రహితంగా వ్యవహరించారు. పిడిగుద్దులతో ఆ యువతిపై విరుచుకుపడ్డారు. అందరూ చూస్తుండగానే బాధితురాలిని నడిరోడ్డుపై కిందతోసివేసి.. బెల్ట్‌తో, కర్రతో కొడుతుండటం చూడవచ్చు. ఈ దారుణం జరుగుతున్నప్పుడూ రోడ్డుపై జనం గుమిగూడారు. ఆ దారుణాన్ని అక్కడి వారు చూస్తునే ఉన్నారు. వీడియోలు చేసారు, కానీ, ఎవరూ ఆ బాధితురాలిని రక్షించడానికి ప్రయత్నించలేదు. ఈ విషయం కూడా ఆ వీడియో చూడవచ్చు. శుక్రవారం రాత్రి ఎల్ఐజీ కూడలి సమీపంలో ఈ దాడి ఘటన జరిగినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోమవారం బయటకు వచ్చింది.
undefined
ఎంఐజీ పోలీస్‌స్టేషన్ ఇన్చార్జ్ అజయ్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం (నవంబర్ 4) ప్రియా వర్మ నెహ్రూ నగర్‌లోని ఆర్జే కచోరి ఎదుట ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న నలుగురు యువతులు అక్కడ చాట్ తినడానికి వచ్చిన ప్రియా వర్మ అనే అమ్మాయితో వాగ్వాదానికి దిగాడు. ఆ వివాదం కొన్ని క్షణాల్లోనే గొడవగా మారింది. రోడ్డుపై అందరూ చూస్తుండగా ఆ యువతులు బాదితురాలని తన్నడం, కొట్టడం, జుట్టు లాగడం. ఓ అమ్మాయి ఆ అమ్మాయిని బెల్టుతో కూడా కొట్టడం. మరో అమ్మాయి బాధితురాలి ఫోన్ ను పగలగొట్టింది. నలుగురు అమ్మాయిలు కలిసి ఓ యువతిని కొట్టి గాయపరిచారని అజయ్ వర్మ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఆ నలుగురు యువతులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.
इंदौर की गुण्डिया इनका पूरा गैंग एक लड़की को की धुनाई करने में जुटा हुआ है pic.twitter.com/iDWep3A4y1
— Tushar Srivastava (@TusharSrilive)బీఆర్టీఎస్ మార్కెట్ 24 గంటలు తెరిచి ఉండడం వల్లే ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయని స్థానికులు అంటున్నారు. 24 గంటలూ రెస్టారెంట్ లు తెరిచి ఉండటం వల్ల మద్యం మత్తులో యువకులు వచ్చి గొడవ పడుతున్నారు. ఈ కూడలిలో పగటిపూట పోలీసులు వాహనాలకు చలాన్లు విధిస్తున్నా.. రాత్రి వేళల్లో పోలీసుల పెట్రోలింగ్ తక్కువగా ఉంటుందని ఆరోపిస్తున్నారు. రాత్రిపూట మత్తులో మునిగితేలుతున్న యువతియువకులపై చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.