లాక్‌డౌన్ కాలంలో మద్యానికి ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకోవాలని జొమాటో భావిస్తోంది. ఇందుకోసం అవసరమైన చర్చలు కూడా జరుపుతోంది. ఇక నుంచి మద్యాన్ని కావాల్సిన వారి కోసం హోమ్ డెలివరీ చేయాలని యోచిస్తోంది.
దేశంలో లాక్ డౌన్ కారణంగా దాదాపు 40 రోజుల పాటు ఎవరికీ మద్యం దొరకలేదు. రెండు రోజుల క్రితమే దేశంలో మద్యం అమ్మకాలు షురూ చేశారు. అయితే.. వందల సంఖ్యలో క్యూలు కట్టి మరీ మద్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా క్యూ లైన్ లో నిలబడలేని వారి కి... జొమాటో బంపర్ ఆఫర్ ఇవ్వనుంది.
లాక్‌డౌన్ కాలంలో మద్యానికి ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకోవాలని జొమాటో భావిస్తోంది. ఇందుకోసం అవసరమైన చర్చలు కూడా జరుపుతోంది. ఇక నుంచి మద్యాన్ని కావాల్సిన వారి కోసం హోమ్ డెలివరీ చేయాలని యోచిస్తోంది.
భారత్‌లో మద్యం హోం డెలివరీకి సంబంధించి ఏ విధమైన చట్టపరమైన నిబంధనలు లేవు. దీంతో ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఎస్‌డబ్ల్యూఏఐ).. జొమాటో, ఇతర సంస్థలతో మద్యం హోం డెలివరీకి సంబంధించి చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.
ఈ క్రమంలో టెక్నాలజీ ఆధారిత హోం డెలివరీ.. బాధ్యయుత మద్యం వినియోగాన్ని ప్రొత్సహించినట్టు అవుతుందని నమ్ముతున్నట్టు జొమాటో సీఈవో మోహిత్ గుప్తా.. ఐఎస్‌డబ్ల్యూఏఐ ముందు ప్రతిపాదనను ఉంచారు. మరోవైపు లాక్‌డౌన్ నిబంధనల వల్ల రెస్టారెంట్‌లు మూసివేయడంతో జొమాటో విభిన్నంగా నిత్యావసరాలు డెలివరీ చేయడం కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.