రాహుల్ గాంధీ 2019 ఎన్నిక సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్.. డిస్మిస్ చేసిన న్యాయస్థానం

By Mahesh KFirst Published Dec 17, 2022, 4:22 PM IST
Highlights

రాహుల్ గాంధీ ఎన్నికను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
 

న్యూఢిల్లీ: కేరళలోని పార్లమెంటు నియోజకవర్గం వయానాడ్ నుంచి 2019లో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ గెలుపును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ అయింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, దీపాంకర్ దత్తాల ధర్మాసనం ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గత పార్లమెంటు ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేయగా.. వయానాడ్ నుంచి గెలిచిన సంగతి తెలిసిందే.

వయానాడ్, ఎర్నాకుళం ఎన్నికలను సవాల్ చేస్తూ పిటిషనర్ సరిత ఎస్ నాయర్ కేరళ హైకోర్టు ను ఆశ్రయించారు. ఈ పిటిషన్ల ను 2019 అక్టోబర్ 31 వ తేదీన రిజెక్ట్ చేసింది. అనంతరం, ఆమె సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. 2020 నవంబర్ 2వ తేదీనే ఆమె పిటిషన్‌ను సుప్రీంకోర్టు నాన్ ప్రాసిక్యూషన్ అంటూ తిరస్కరించింది.

ఈ అప్లికేషన్‌ను పునరుద్ధరించాలని ఓ అప్లికేషన్ వేశారు. దీంతో శుక్ర వారం మల్లీ ఈ పిటిషన్ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చింది.

Also Read: ఎనిమిదేళ్లలో ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాని పీఎం : మోడీపై కాంగ్రెస్ విమ‌ర్శ‌లు

నవంబర్ 2, 2020న అప్పటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బాబ్డే సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. సెకండ్ కాల్‌కు కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో పిటిషనర్ కనెక్ట్ కాలేదు. దీంతో నాన్ ప్రాసిక్యూషన్ కింద స్పెషల్ లీవ్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

రెండు క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలిన సునీతా ఎస్ నాయర్ 2019 పార్లమెంటు ఎన్నికల్లో వయానాడ్, ఎర్నాకుళం స్థానాల్లో నామినేషన్ పేపర్లు దాఖలు చేశారు. కానీ, క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలడం మూలంగా ఆ  నామినేషన్ పేపర్లను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించారు. హైకోర్టు ఆమె నామినేషన్ పేపర్ల తిరస్కరణను సమర్థించింది. ఎందుకంటే ఈ రెండు క్రిమినల్ కేసుల్లో దోషిత్వాన్ని ఆమె సస్పెండ్ చేసుకోలేదని, కేవలం ఆమెకు పడిన శిక్షణఏ అప్పెల్లేట్ కోర్టు సస్పెండ్ చేసిందని వివరించింది.

click me!