టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న వాహనాలపైకి ఓ కారు దూసుకొచ్చింది. రెండు వాహనాలను వేగంగా ఢీకొట్టింది. దీని వల్ల ఆరు వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. మరో 6 గురు గాయపడ్డారు.
ముంబైలోని టోల్ ప్లాజా వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ఆగి ఉన్న పలు వాహనాలను ఆ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. గురువారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుందని, ప్రమాదానికి కారణమైన కారు వర్లీ నుంచి బాంద్రా వైపు వెళ్తోందని చెప్పారు.
ఘోరం.. ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. ఆరుగురు మృతి, 25 మందికి గాయాలు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్లీ నుంచి బాంద్రా వెళ్లే దారిలో సీ లింక్ టోల్ ప్లాజా ఉంది. అక్కడ గురువారం రాత్రి సమయంలో వాహనాలన్నీ ఆగుతూ, టోల్ కడుతూ వెళ్తున్నాయి. అదే సమయంలో ఓ ఇన్నోవా వేగంగా వచ్చి టోల్ ప్లాజాకు 100 మీటర్ల ముందు ఆగి ఉన్న మెర్సిడెస్ కారును ఢీకొట్టింది. ఆ తర్వాత మరో రెండు, మూడు వాహనాలను ఢీకొట్టింది. దీని వల్ల మొత్తంగా ఆరు కార్లు ప్రమాదానికి గురయ్యాయి.
రసవత్తరంగా వేములవాడ పాలిటిక్స్... నామినేషన్లకు సిద్దమైన బిజెపి రెబల్ అభ్యర్థులు వీరే
ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురి పరిస్థితి నిలకడగా ఉంది. తీవ్రంగా గాయపడిన వారిలో ఒకరు లీలావతి హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా.. మరో ఐదుగురు భాభా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. కాగా.. గాయపడిన వారిలో ఇన్నోవా కారు డ్రైవర్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.