సైకిలిస్టును ఢీ కొన్న కారు... కిలోమీటరు లాక్కెల్లి...!

Published : Jan 07, 2023, 11:08 AM IST
సైకిలిస్టును ఢీ కొన్న కారు... కిలోమీటరు లాక్కెల్లి...!

సారాంశం

కేతన్‌ అనే విద్యార్థి... సైకిల్‌పై కోచింగ్‌కు వెళుతుండగా, వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది.  ఈ క్రమంలో  కారు వెనుక గార్డులో కేతన్ కాలు ఇరుక్కుపోవడంతో సుమారు కిలోమీటరు వరకు ఈడ్చుకెళ్లాడు.  

దేశరాజధాని ఢిల్లీలో జరిగిన హిట్ అండ్ రన్ కేసు ఎంత కలకలం రేపిందో అందరికీ తెలిసిందే. ఆ ఘటన తర్వాత..... అలాంటి సంఘటన మరికొన్ని వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా... ఉత్తరప్రదేశ్ లో ఓ హిట్ అండ్ రన్ కేసు వెలుగులో కి వచ్చింది. సైకిల్ మీద వెళ్తున్న ఓ విద్యార్థిని... కారు ఢీ కొట్టింది. ఆ తర్వాత... దాదాపు కిలోమీటరు పాటు... కారు వెంట అతనిని లాక్కెళ్లడం గమనార్హం.

కేతన్‌ అనే విద్యార్థి... సైకిల్‌పై కోచింగ్‌కు వెళుతుండగా, వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది.  ఈ క్రమంలో  కారు వెనుక గార్డులో కేతన్ కాలు ఇరుక్కుపోవడంతో సుమారు కిలోమీటరు వరకు ఈడ్చుకెళ్లాడు.

ఈ ఘటనను ప్రత్యక్షంగా వీక్షించిన స్థానికులు వెంటనే స్పందించారు. ముందుగా కారును అడ్డుకొని దానిని ఆపేశారు. అనంతరం  గార్డులో ఇరుక్కుపోయిన విద్యార్థిని కారును బయటకు తీశారు. ఆగ్రహించిన జనం కారు డ్రైవర్‌ను ఈడ్చుకెళ్లి కొట్టారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను శాంతింపజేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన విద్యార్థి  ప్రస్తుతం వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నాడు. బాలుడు మైనర్ అని...  ప్రస్తుతం ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

Sabarimala Karthika Deepam: స్వామియే శరణం.. శబరిమల కార్తీక దీపం చూశారా? | Asianet News Telugu
Putin RaGhat Visit:రాజ్ ఘాట్ సందర్శించనున్న పుతిన్.. ఢిల్లీలో భారీగా భద్రత | Asianet News Telugu